Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: ఆ విషయంలో మేం విఫలమయ్యాం: అభిషేక్ శర్మ

పిచ్ కండిషన్స్‌‌‌కు అలవాటు పడకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ అన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది.

IND vs IRE: ఆ ఇద్దరిపై వేటు.. వైభవ్‌కు చోటు! ఐర్లాండ్‌తో రెండో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

IND vs IRE: ఆ ఇద్దరిపై వేటు.. వైభవ్‌కు చోటు! ఐర్లాండ్‌తో రెండో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

పిచ్ కండిషన్స్‌ అర్థం చేసుకోలేకపోయాం..

ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న అభిషేక్ శర్మ.. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోయామని తెలిపాడు. 'పిచ్ కండిషన్స్‌కు త్వరగా అలవాటు పడకపోవడమే మా ఓటమికి ప్రధాన కారణం. వరుసగా మ్యాచ్‌లు ఆడేటప్పుడు.. ప్రాక్టీస్ సెషన్లలోనే పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఒక బలమైన జట్టుగా మేం త్వరగా అలవాటు పడటంలో విఫలమయ్యాం. అదే మా విజయవకాశాలను దెబ్బతీసింది.’అని అభిషేక్ చెప్పుకొచ్చాడు.

Abhishek Sharma Gives Brutally Honest Verdict After India s Shock Defeat To Ireland Says No Excuses

ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కన్ టక్కర్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. గారెత్ డెలనీ(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. జార్జ్ డాక్‌రెల్(10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 19) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(3/24) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్(2/28), అక్షర్ పటేల్(2/33) రెండేసి వికెట్లు పడగొట్టారు.

IND vs IRE: ఆ ఇద్దరి వల్లే టీమిండియాకు ఓటమి!

IND vs IRE: ఆ ఇద్దరి వల్లే టీమిండియాకు ఓటమి!

అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా .. శివమ్ దూబే(14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతర్జాతీయ క్రికెట్‌లోభారత్‌పై ఐర్లాండ్‌‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌తో 8 టీ20లు, 3 వన్డేలు ఆడిన ఐర్లాండ్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ విజయంతో రెండు టీ20ల సిరీస్‌లో ఐర్లాండ్‌ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, June 27, 2026, 13:40 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+