IND vs ENG: శ్రేయస్ అయ్యర్‌పై అరిచిన అభిషేక్ శర్మ!(వీడియో)
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ శర్మ.. శ్రేయస్ అయ్యర్‌పై గట్టిగా అరిచేసాడు.
సింగిల్‌కు మూమెంటమ్ ఇస్తూ.. నిదానంగా పరుగెత్తుతున్న అయ్యర్‌పై అభిషేక్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాస్త త్వరగా పరుగెత్తు బ్రో అని నవ్వుతూనే గట్టిగా అరిచాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆదిలోనే వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ వికెట్లు కోల్పోయింది. దాంతో పవర్ ప్లేలోనే శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగా.. ఐదో ఓవర్‌లో అభిషేక్ శర్మ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇదే ఓవర్‌లో ఇషాన్ కిషన్ ఔటైన అనంతరం అయ్యర్ బ్యాటింగ్‌కు రాగా.. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న అభిషేక్ శర్మ క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు.

అయితే క్రీజు మధ్యలోకి వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ సింగిల్‌కు నిరాకరించడంతో యూటర్న్ తీసుకున్న అభిషేక్ శర్మ డైవ్ చేశాడు. ఫీల్డర్ డైరెక్ట్ హిట్ చేయకపోవడంతో అభిషేక్ ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే అయ్యర్‌ను ఉద్దేశించి 'అరే పాజీ.. కాస్త త్వరగా పరుగెత్తు. సింగిల్‌కు మూమెంటమ్ ఇచ్చి వెనకడుగు వేస్తున్నావ్'అని అరిచాడు. ఆ కాసేపటికే అభిషేక్ శర్మ(16) రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఘోర పరాజయం.. సిరీస్ సమర్పాయమి..
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. మరోసారి షార్ట్ పిచ్ బాల్స్‌కే భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అనంతరం ఇంగ్లండ్ 13.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 నాటౌట్),ఓపెనర్ ఫిల్ సాల్ట్(42 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఏకైక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

