For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా దూకుడు సీక్రెట్ ఇదే: అభిషేక్ శర్మ

తన రేంజ్‌లో ఉంటే తొలి బంతిని కూడా సిక్సర్‌గా తరలిస్తానని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. తాను ఓ ఫ్లో ప్రకారం ఆడుతానని చెప్పాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఓటమెరుగని జట్టుగా భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

ఔటవ్వకుండా ప్రాక్టీస్..

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తన బ్యాటింగ్ శైలి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దూకుడుగా ఆడేందుకు తాను చాలా కష్టపడ్డానని, నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు.'నేను నా జట్టుకు కాల్సిన పనిని పూర్తి చేశాను. నేను గతంలోనే చెప్పాను. ఓ ఫ్లో ప్రకారం ఆడుతాను. నా రేంజ్‌లో ఉంటే అది మొదటి బంతి అయినా సరే భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తాను. తద్వారా పవర్ ప్లేలో జట్టుకు మంచి స్కోర్ అందించాలనుకుంటాను. గత మ్యాచ్‌ల్లో నా వికెట్ తీయాలని ప్రత్యర్థి బౌలర్లు ప్రయత్నించారు.

Abhishek Sharma Explains Aggressive Batting Style I Go With the Flow Adapt to Pitch and Field Conditions
Photo Credit: X (twitter)

అందుకే నేను తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాను. కానీ ఈ మ్యాచ్‌లోని పిచ్ కొత్తది. ఈ పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నేను, శుభ్‌మన్ గిల్ కాస్త సమయం తీసుకొని ఆడాలని నిర్ణయించుకున్నాం. నేను ఎప్పుడూ ఫీల్డ్‌ను బట్టి ఆడాలనుకుంటాను. ఫీల్డ్‌ను చూసే షాట్స్ ఆడుతాను. ఇలా దూకుడుగా ఆడేందుకు నేను నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాను. బ్యాటర్లకు నెట్స్‌లో చాలా బంతులు ఆడే సమయం దొరుకుతుంది. నెట్స్‌లో చాలా షాట్స్ ఆడితే ఔటయ్యే అవకాశం ఉంటుంది. కానీ నేను మాత్రం ఔటవ్వకుండా ప్రాక్టీస్ చేస్తాను.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్(2/27) రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫిద్దిన్ తలో వికెట్ తీసారు.

అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ సైఫ్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. పర్వేజ్ హోస్సేన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), వరుణ్ చక్రవర్తీ(2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌, తిలక్ వర్మ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫీల్డర్లు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఇందులో నాలుగు క్యాచ్‌లు సైఫ్ హసన్‌వే కావడం గమనార్హం.

Story first published: Thursday, September 25, 2025, 7:05 [IST]
Other articles published on Sep 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+