Abhishek Sharma: ఈ సెంచరీ వారికి అంకితం.. SRH వల్లే నా జీవితం మారింది
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మేనేజ్‌మెంట్ ఇచ్చిన స్వేచ్ఛతోనే తాను స్టార్ క్రికెటర్‌గా ఎదిగానని ఆ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. ఫ్రీడమ్ ఇస్తే పంజాబీ ఆటగాళ్లు చెలరేగిపోతారని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 47 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) విధ్వంసకర శతకంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన సెంచరీని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు.
ఉప్పల్‌లో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే..
'ఈ మ్యాచ్‌లో మేం స్పష్టమైన ప్రణాళికతో మా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. ట్రావిస్ హెడ్, నేను పవర్ ప్లేను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అనుకున్నాం. కానీ ఆరంభంలో పిచ్ స్లోగా ఉందని అర్థమైంది. దాంతో మేం మా ప్లాన్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. నేను మాత్రం వేగంగా ఆడే ప్రయత్నం చేశాను.
ఉప్పల్ మైదానం నాకు ఎంతో ప్రత్యేకం. ఈ స్పెషల్ గ్రౌండ్‌లో పరుగులు సాధించడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. అయితే 20 ఓవర్లు ముగిసే వరకు ఏది సరైన స్కోరో చెప్పలేం. అది నా మనసులో ఉంది. కానీ నేను కేవలం ప్రేక్షకులను అలరించాలనుకున్నాను.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన స్వేచ్ఛ అవకాశాలతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. మూడేళ్ల క్రితం పవర్ ప్లేలో నా ప్రతిభను చూపించుకోవాలనే కోరిక ఉండేది. 2024 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న వాతావరణం మా అందరికీ ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మా మేనేజ్‌మెంట్ విజయాలే కాకుండా కుర్రాళ్లను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు.
వారి కోసమే L సెలెబ్రేషన్స్..
నా పంజాబ్ జట్టులో కూడా నేను ఇలాగే ఆడాలనుకున్నాను. పంజాబ్ ఆటగాళ్లకు స్వేచ్ఛను ఇస్తే చెలరేగుతారు. హైదరాబాద్‌లో ఆడటం కూడా నాకు అలాగే అనిపిస్తుంది. నేను ఈ 'L' సెలబ్రేషన్‌ను చాలా కాలంగా కొనసాగిస్తున్నాను. ఈ స్టేడియంతో పాటు మాకు మద్దతు ఇచ్చే అభిమానులపై ఉన్న ప్రేమే ఈ సెలెబ్రేషన్స్‌కు కారణం.
హోటల్ దగ్గర కూడా వారు చూపించే అభిమానం అద్భుతం. అందుకే నా వంతుగా వారికి నా ప్రేమను తిరిగి ఇవ్వాలనుకున్నాను. అలాగే, ఈరోజు మా అమ్మనాన్నల సమక్షంలో సెంచరీ చేయడం ప్రత్యేకమైన అనుభూతి. మా అక్క ఇన్ఫెక్షన్ వల్ల ఈరోజు మ్యాచ్‌కు రాలేకపోయింది. ఈ సెంచరీ ఆమె కోసం కూడా.
మా నాన్న సైగలతో ఎలా ఆడాలో చెబుతాడు..
నేను అండర్-12 ఆడుతున్నప్పటి నుంచి మా నాన్నగారు ఎప్పుడూ స్క్రీన్‌కు దగ్గరగానే కూర్చుంటారు. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఆయన అలాగే కూర్చున్నారు. నేను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నప్పుడు కూడా ఎలా ఆడాలో ఆయన నాకు సైగలతో చెబుతూనే ఉంటారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది.
వచ్చే మ్యాచ్‌లో కెమెరాను అటువైపు చూపిస్తే ఆయన రియాక్షన్స్ చూడటం చాలా ఫన్నీగా ఉంటుంది. నేను ఆయన వైపు చూడటం.. ఆయన నాకు సూచనలు ఇవ్వడం నిజంగా అద్భుతం. అది నాకు ఎంతో సహాయపడుతుంది. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు రాణించడం ఎప్పుడూ ప్రత్యేకమే.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications