Abhishek Sharma: పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్..!!(వీడియో)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ కాటేరమ్మ కొడుకు విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసాడు. అయితే గతంలోలాగా గుడ్డిగా ఆడకుండా మంచి బంతులను గౌరవిస్తూ తన జోన్‌లో ఉన్న బాల్స్‌ను మాత్రమే బౌండరీకి తరలించాడు. నితీష్ రాణా వేసిన 15వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మకు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. ఈ సెంచరీ అనంతరం తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. తన ట్రేడ్ మార్క్ లవ్ సైగలతో సంతోషం వ్యక్తం చేశాడు.

సన్‌రైజర్స్ భారీ స్కోర్..
68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 పరుగులతో అజేయంగా నిలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 242/2 భారీ స్కోర్ అందించాడు. ట్రావిస్ హెడ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ఇషాన్ కిషన్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్'అని సాంగ్‌తో అభిషేక్ విధ్వంసాన్ని ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.
రోహిత్ రికార్డ్ బద్దలు..
ఈ విధ్వంసకర శతకంతో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్ సమం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీతో అభిషేక్ శర్మ సమంగా నిలిచాడు. తాజా సెంచరీ అభిషేక్ శర్మకు 9వ టీ20 శతకం. ఐపీఎల్‌లో రెండు శతకాలు బాదిన అభిషేక్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున మరో రెండు సెంచరీలు బాదాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పంజాబ్ టీమ్ తరఫున 5 శతకాలు నమోదు చేశాడు.
విరాట్ కోహ్లీ 420 టీ20 మ్యాచ్‌ల్లో 9 శతకాలు నమోదు చేస్తే.. అభిషేక్ శర్మ 188 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ శర్మ 467 మ్యాచ్‌ల్లో 8 శతకాలతో మూడో స్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్(245 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు), సంజూ శాంసన్(336 మ్యాచ్‌ల్లో 7), ఇషాన్ కిషన్(236 మ్యాచ్‌ల్లో 7) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఓవరాల్‌గా టీ20ల్లో 9 శతకాలు బాదిన నాలుగో బ్యాటర్‌గా క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీతో సమంగా నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 22 శతకాలతో టాప్‌లో ఉండగా.. బాబర్ ఆజామ్(12), సన్‌రైజర్స్ హైదరాబాద్ దిగ్గజం డేవిడ్ వార్నర్(10) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
క్రిస్ గేల్ తర్వాత..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 10 ప్లస్ సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. అభిషేక్ శర్మ మొత్తం 5 మ్యాచ్‌ల్లో 10+ సిక్సర్లు బాదగా.. క్రిస్ గేల్ 18 మ్యాచ్‌ల్లో 10+ సిక్సర్లు కొట్టాడు. ఎవిన్ లూయిస్, శ్రేయస్ అయ్యర్ చెరో నాలుగు సార్లు 10+ సిక్సర్లు కొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications