Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. కెప్టెన్ రికార్డ్ బద్దలు!

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

అభిషేక్ శర్మ 1000 పరుగులు చేసేందుకు 528 బంతులు ఆడాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్(573 బంతులు), ఫిల్ సాల్ట్(599), గ్లేన్ మ్యాక్స్‌వెల్(604), ఆండ్రూ రస్సెల్, ఫిన్ అలెన్(609) అభిషేక్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇన్నింగ్స్‌ల పరంగా మాత్రం అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. 27 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసి కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ(28), సూర్యకుమార్ యాదవ్(31), రోహిత్ శర్మ(40) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Abhishek Sharma Creates History Breaks Suryakumar Yadav s Record to Achieve Unbelievable World Record

వర్షం అంతరాయం కలించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లతో 29 బ్యాటింగ్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) దూకుడుగా ఆడారు.

బెన్ ద్వార్షూయిస్ వేసిన తొలి ఓవర్‌లోనే ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గ్లేన్ మ్యాక్స్‌వెల్ నేలపాలు చేయగా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఇచ్చిన మరో ఈజీ క్యాచ్‌ను ద్వార్షూయిస్ చేజార్చాడు. ఈ రెండు అవకాశాలతో అభిషేక్ చెలరేగాడు. క్యాచ్‌ వదిలిన మరుసటి బంతికే సింగిల్ తీసి టీ20ల్లో 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఆ తర్వాత భారీ సిక్సర్ బాది జోరు కనబర్చగా.. ప్రతికూల వాతావరణం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు.

Story first published: Saturday, November 8, 2025, 15:44 [IST]
Other articles published on Nov 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+