Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆ యువ బ్యాటర్ కోసం ఎగబడ్డ జనం.. అప్పుడే టికెట్లన్నీ ఖతమ్!

అంతర్జాతీయ టీ20ల్లో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా నెంబర్ వన్‌గా కొనసాగుతుంది. విధ్వంసకర బ్యాటింగ్.. కళ్లు చెదిరే ఫీల్డింగ్, బౌలింగ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 టోర్నీలో ఓటమెరుగని జట్టుగా టైటిల్ అందుకుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. మూడు వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.

అంతర్జాతీయ టీ20లు, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే వన్డే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లన్నీ పూర్తిగా సేల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన భారతీయులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఈ సిరీస్‌లకు సంబంధించిన టికెట్ల కోసం ఎగబడ్డారు.

Abhishek Sharma Craze Spurs Early Sell-Out for India vs Australia T20I in Melbourne

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అక్టోబర్ 31న మెల్‌బోర్న్ వేదికగా జరిగే రెండో టీ20 టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మెల్‌బోర్న్‌లో భారతీయుల సంఖ్య ఎక్కువ. ఆస్ట్రేలియా మొత్తంలోనే మెల్‌బోర్న్‌లోనే అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉంటారు. ఇందులో చాలా మంది అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.

మూడు వన్డేలు, ఐదు టీ20లకు సంబంధించిన టికెట్లలో ఇప్పటికే 1,75000 అమ్ముడుపోయాయని, మరో 30 వేల టికెట్లు మాత్రమే మిగిలాయని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. సిడ్నీ, మనుక ఒవల్‌లో ఇప్పటికే పూర్తిగా టికెట్లు అమ్ముడుపోగా.. గబ్బా టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. మిగతా వేదికల్లో 5 వేల టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మ్యాచ్‌ల సమయానికి అవి కూడా పూర్తిగా అమ్ముడుపోనున్నాయి. 'మెల్‌బోర్న్ టీ20 మ్యాచ్ టికెట్ల డిమాండ్ ఈ సిరీస్‌పై ఉన్న ఆసక్తికి మరో ఉదాహరణ'అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్ బెర్గ్ తెలిపాడు.

ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటన వెళ్లే జట్లను భారత సెలెక్టర్లు ప్రకటించారు. టీమిండియా వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కెప్టెన్సీ కోల్పోయినా ఆటగాడిగా రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. రవీంద్ర జడేజాపై వేటు వేసిన సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. సిరాజ్ వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా.. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఆసియా కప్ 2025లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన తిలక్ వర్మ.. టీ20లకే పరిమితమయ్యాడు.

Story first published: Monday, October 6, 2025, 16:34 [IST]
Other articles published on Oct 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+