IND vs PAK: అభిషేక్ శర్మ.. గుడ్డిగా ఊపితే ఇలానే ఉంటుంది!
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. పాకిస్థాన్ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగుతాడని భావించిన భారత అభిమానులను అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే చెత్త షాట్‌తో వికెట్ పారేసుకొని పెవిలియన్ చేరాడు.
బ్యాటింగ్‌కు ప్రతీకూలంగా ఉన్న వికెట్ అని తెలిసినా.. బంతి ఆగుతూ వస్తుందని చూడకుండా గుడ్డిగా షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. మూడు బంతులు డాట్ చేసిన అభిషేక్ శర్మకు సల్మాన్ అలీ అఘా తెలివైన బంతి వేసి బోల్తా కొట్టించాడు. షాట్ ఆడుతాడని గ్రహించి అందుకు తగ్గట్లు ఫీల్డ్ సెటప్ చేసి ఊరించే బంతి వేసాడు. ఈ ఉచ్చును గ్రహించని అభిషేక్ శర్మ.. గుడ్డిగా షాట్ ఆడి భారత్‌కు నష్టం చేశాడు.

వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఇంకా ఖాతా తెరవలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌటైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న అభిషేక్ శర్మ.. కీలకమైన పాకిస్థాన్‌తో బరిలోకి దిగినా అంచనాలను అందుకోలేకపోయాడు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ గుండు సున్నా అని, పెద్ద గుడ్డు పెట్టాడని కామెంట్ చేస్తున్నారు. ఇలా అయితే కష్టమని, అభిషేక్ శర్మ కాస్త చూసుకొని ఆడాలని హితవు పలుకుతున్నారు. కండిషన్స్‌ను గౌరవించకుండా గుడ్డిగా ఊపితే ఇలానే ఉంటుందని మండిపడుతున్నారు. మహమ్మద్ అమీర్ అన్నట్లు అభిషేక్ శర్మ గాలిగాడేనని, గత 6 ఇన్నింగ్స్‌ల్లో 4 డకౌట్స్ ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications