For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుమ్మురేపిన కావ్య పాప ఫేవరేట్ ప్లేయర్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. పురుషుల బ్యాటింగ్ టీ20 ర్యాకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ 829 రేటింగ్ పాయింట్స్‌తో ఒక స్థానం ఎగబాకి అగ్ర స్థానంలో నిలిచాడు. గత ఐదు నెలలుగా టీమిండియా ఒక్క టీ20 మ్యాచ్ ఆడలేదు. అయినా అభిషేక్ శర్మకు అగ్రస్థానం దక్కడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

5 నెలలుగా ఒక్క మ్యాచ్ ఆడకున్నా..

అయితే అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రేటింగ్ పాయింట్స్ తగ్గడంతోనే అభిషేక్ శర్మకు అగ్రస్థానం దక్కింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ట్రావిస్ హెడ్ అంతర్జాతీయ టీ20లు ఆడటం లేదు. ఈ సమయంలో ఆసీస్ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌తో పాటు ఇటీవల వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడింది. ఈ రెండు సిరీస్‌లకు ట్రావిస్ హెడ్ దూరంగా ఉన్నాడు.

Abhishek Sharma Becomes World No 1 T20I Batter Despite Five-Month Absence

ఐసీసీ రూల్స్ ప్రకారం జట్టు మ్యాచ్‌లకు దూరమైన ఆటగాళ్ల రేటింగ్ పాయింట్స్‌లో కోత పడుతోంది. 8 మ్యాచ్‌లు ఆడకపోవడంతో ట్రావిస్ హెడ్ రేటింగ్ పాయింట్స్ 814కు పడిపోయాయి. మరోవైపు గత ఐదు నెలల్లో భారత్ ఒక్క టీ20 కూడా ఆడలేదు. దాంతో అభిషేక్ శర్మ రేటింగ్ పాయింట్స్ తగ్గలేదు. దాంతోనే 829 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌తో అభిషేక్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అభిషేక్ శర్మ అగ్రస్థానంలో నిలవడంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుమ్మురేపిన కాటేరమ్మ కొడుకని కామెంట్ చేస్తున్నారు.

నాలుగో బ్యాటర్‌గా రికార్డ్..

భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న నాలుగో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ శర్మ కంటే ముందున్నారు. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ 804 రేటింగ్ పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(739) ఆరో స్థానంలో, యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారి 11 ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ 6 స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు. టీమ్ డేవిడ్ 12 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్ అందుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో ఉండగా.. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ బౌలర్ జాకోబ్ డఫ్ఫీ టాప్‌లో ఉన్నాడు. భారత్ నుంచి వరుణ్ చక్రవర్తీ మూడో స్థానంలో నిలిచాడు.

Story first published: Wednesday, July 30, 2025, 17:32 [IST]
Other articles published on Jul 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+