అతని కోసం తిలక్ వర్మను తప్పించాల్సిన అవసరం లేదు: టీమిండియా మాజీ కోచ్
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కోసం వైస్ కెప్టెన్ తిలక్ వర్మను తప్పించాల్సిన అవసరం లేదని మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. సంజూ శాంసన్‌ను అతనికి బాగా అచ్చొచ్చిన టాప్-3లోనే ఆడించాలని సూచించాడు. మిడిలార్డర్‌లో అతను రాణించలేడని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 202 పరుగల భారీ లక్ష్యఛేదనలో టీమిండియా 76 పరుగులకే ఆలౌటైంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే టీమిండియాకు ఇది అత్యంత ఘోర పరాజయం.

మార్పులు అవసరం లేదు..
ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అభిషేక్ నాయర్‌ను సంజూ శాంసన్ కోసం తిలక్ వర్మను తప్పించాలా? అని ప్రశ్నించగా అవసరం లేదని బదులిచ్చాడు. వరుస పరాజయాలతో కంగారు పడి జట్టులో అనవసర మార్పులు చేయాల్సిన అవసరం లేదని అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు.
'సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలనుకుంటే.. అతను రాణించగలిగే సరైన స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ కేవలం అతన్ని జట్టులోకి చేర్చాలనే ఉద్దేశంతో నంబర్ 4, 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపించడం సరికాదు. ఎందుకంటే అతను ఆ స్థానాల్లో ఎక్కువగా ఆడలేదు. ఆడినా ఆ స్థానాల్లో పెద్దగా రాణించలేదు.
ఓపెనర్‌గానే రాణించాడు..
అతను ఓపెనర్‌గా లేదా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసినప్పుడే అత్యుత్తమంగా రాణించాడు. కాబట్టి సంజూకు ఆ స్థానం ఇవ్వలేనప్పుడు అతన్ని ఆడించకపోవడమే మంచిది. అతన్ని మిడిలార్డర్‌లో ఆడించడానికి బదులు ప్రస్తుతం భారత్‌కు ఉన్న బ్యాటింగ్ లైనప్‌తోనే కొనసాగడం ఉత్తమం.
పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకునే విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్ పునరాలోచన చేయాలి. గౌతమ్ గంభీర్ చెప్పినట్లుగా.. వారు రెండు ఇన్నింగ్స్‌ల్లో 190 పరుగులు చేశారు. కానీ అది మొదట బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రమే. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే వారు ఛేజింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పరుగులు చేయడానికి అవసరమైన సరైన టెంపోను వారు అందుకోలేకపోయారు.
మార్పులు అవసరం లేదు..
వరుస పరాజయాలతో కంగారుపడిపోయి.. మార్పులు చేయాలనే ఒకే ఒక్క కారణంతో అనవసర మార్పులు చేయకూడదు. ఒకవేళ సంజూ శాంసన్ జట్టులోకి తీసుకోవాలనుకుంటే .. యాజమాన్యం చేయాల్సింది ఒక్కటే.. అతను విజయవంతం కావడానికి సరిపోయే సరైన స్థానంలో అతన్ని బ్యాటింగ్‌కు పంపించాలి.'అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.
ఫస్ట్ డౌన్‌లో ఆడినప్పుడు మెరుగ్గా రాణించిన తిలక్ వర్మ.. ఐదో స్థానంలో రాణించలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ కోసం తిలక్ వర్మను లోయరార్డర్‌లో ఆడిస్తుండటంతో అతను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

