న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన బ్యాటింగ్‌తో చెలరేగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బిగ్ హిట్టర్ రింకూ సింగ్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సూచించాడు. రింకూ సింగ్‌ను సరిగ్గా వాడుకుంటే టీమిండియాకు త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా ఉపయోగపడుతాడని చెప్పాడు. టీమిండియా ఫినిషర్‌గా అతను పనికొస్తాడని సలహా ఇచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ నితీశ్ రాణాతో కలిసి రింకూ సింగ్ ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడీంచి విజయానికి బాటలు వేసాడు.

ఈ సీజన్‌లో మిడిల్ ఆర్డర్‌లో 50 సగటుతో 400లకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్న రింకూ సింగ్.. ఇప్పటిదాకా 3 హాఫ్ సెంచరీలు, మరో ఐదు సార్లు 40+ స్కోర్లు నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందించాడు.
ఈ క్రమంలోనే రింకూ సింగ్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు. 'రింకూ సింగ్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడుతాడు. ఫస్ట్ క్లాస్ సీజన్‌లో, దేశవాళీ టోర్నీల్లో రింకూ సింగ్ ట్రాక్ రికార్డు గమనిస్తే.. అతని రికార్డులు ఏంటో అర్థమవుతాయి.
గత మూడు నాలుగు సీజన్లలో బాగా సక్సెస్ అయిన, అవుతున్న ప్లేయర్లలో రింకూ సింగ్ పేరు కూడా ఉంటుంది. కరెక్టుగా వాడుకుంటే అతను మూడు ఫార్మాట్లలో టీమిండియాకు మంచి ఫినిషర్‌గా మారతాడు.'అని కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపాడు.