ఇదెక్కడి క్యాచ్‌రా మామ! (వీడియో)
'క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి'ఇది పాత మాట. కానీ 'అవే క్యాచ్‌లు అభిమానుల మనస్సులను కూడా గెలుచుకుంటాయి'ఇది నేటి మాట. తాజాగా అలాంటి క్యాచే ఒకటి బెంగాల్ ప్రో టీ20 లీగ్ 2024లో అభిమానులను కనువిందు చేసింది. అభిషేక్ దాస్ అనే ఆటగాడు అందుకున్న ఆ క్యాచ్ దిగ్గజ ఆటగాళ్లను గుర్తు చేసింది.
టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో పాటు ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ కూడా ఆ కుర్రాడి క్యాచ్ ముందు తక్కువేననే అభిప్రాయం కలుగుతోంది. బౌండరీ లైన్ వద్ద అభిషేక్ దాస్ చేసిన ఫీల్డింగ్ విన్యాసం క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. 'ఇదెక్కడి క్యాచ్ రా మామ'అంటూ కొనియాడుతున్నారు.

బెంగాల్ ప్రో టీ20 లీగ్‌లో భాగంగా రేష్మి మెదినిపూర్ వర్సెస్ అడమస్ హౌరా వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా 19వ ఓవర్‌లో దీపక్ మహోతా కొట్టిన స్ట్రైట్ డ్రైవ్.. సిక్సర్‌గా దూసుకెళ్లింది. కానీ అక్కడే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అభిషేక్ దాస్ సూపర్ మ్యాన్‌లా జంప్ చేసి సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు.
ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో ఈడెన్ గార్డెన్స్ మైదానంలోని అభిమానులు ఎగిరి గంతేసారు. మ్యాచ్ గెలిచినంత సంబర పడ్డారు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిషేక్ దాస్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ దాస్ ప్రాతినిథ్యం వహిస్తున్న అడమస్ హౌరా వారియర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications