
ఎవరు గొప్పో తెలియాలంటే:
క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడాడు. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌లలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు రజాక్ ఇలా స్పందించాడు. 'భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లను పోల్చిచూడొద్దు. ఎందుకంటే పాక్‌లోనే నైపుణ్యమున్న క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. చరిత్ర చూస్తే ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు కనిపిస్తారు. మహ్మద్ యూసుఫ్, ఇంజమామ్ ఉల్ హక్, సయీద్ అన్వర్, జావెద్ మియాందాద్, జహీర్ అబ్బాస్, ఇజాజ్ అహ్మద్ లాంటి వారు ఉన్నారు. వీళ్లని పోల్చిచూడండి. కోహ్లీ, బాబర్ ఇద్దరూ వేర్వేరు ఆటగాళ్లు. వీరిని పోల్చిచూడాల్సి వస్తే ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించాలి. అప్పుడు ఎవరు గొప్ప ఆటగాడో తెలుస్తుంది' అని అన్నాడు.

కోహ్లీపై ఎలాంటి కోపతాపాలు లేవు:
'విరాట్ కోహ్లీపై నాకు ఎలాంటి కోపతాపాలు లేవు. అతడు పాకిస్థాన్ పైనా బాగా ఆడాడు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే భారతీయులు తమ ఆటగాళ్లను పాక్ క్రికెటర్లతో పోల్చి చూడనప్పుడు.. మేమెందుకు అలా పోల్చుకోవాలి. బాబర్
అజామ్ కూడా నైపుణ్యమున్న బ్యాట్స్‌మన్. ప్రపంచ స్థాయిలో అతడేంటో నిరూపించుకున్నాడు. అతడిని సరిగ్గా చూసుకుంటే అన్ని రికార్డులూ బద్దలు కొడతాడు. బాబర్ 5-6సంవత్సరాలు నా కింద ఆడాడు. అతడు జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటున్నా' అని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు.

2015లో బాబర్ అరంగేట్రం:
2015లో పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన బాబర్ అజామ్ ఇప్పటి వరకూ 31 టెస్టులాడి 44.2 సగటుతో 2167 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 77 వన్డేల్లో 55.9 సగటుతో 3580 పరుగులు చేసాడు. వన్డేల్లో 12 శతకాలు, 16 అర్ధ శతకాలు సాధించాడు. ఇక 47 టీ20లు ఆడి 48.00 సగటుతో 1730 పరుగులు చేశాడు. టీ20లో 16 హాఫ్ సెంచరీలు బాదాడు. ప్రస్తుతం బాబర్ అజామ్ వయసు 26 ఏళ్లు కాగా.. ఈ వయసులో కోహ్లీ గణాంకాలు ఇలా లేవు.

2008లో కోహ్లీ అరంగేట్రం:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 251 వన్డేల్లో 59.3 సగటుతో 12040 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 60 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 85 టీ20లలో 50.5 సగటుతో 2928 పరుగులు చేశాడు. ఇందులో 25 హాఫ్ సెంచరీలు బాదాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేశాడు.


Click it and Unblock the Notifications

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రికి కరోనా!!










