
ఆ ఇద్దరికి రుణపడి ఉంటా...
కొడుకు అద్బుత ప్రదర్శన పట్ల ఉప్పొంగిపోతున్న అబ్దుల్ రషీద్.. ఉమ్రాన్ మాలిక్ సక్సెస్‌కు కారణమైన అబ్దుల్ సమద్, ఇర్ఫాన్ పఠాన్‌లకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. 'ఉమ్రాన్ మార్కెట్‌లో నన్ను సెలెబ్రిటీని చేశాడు. మార్కెటే కాదు జమ్మూ మొత్తం నేను తెలిసిపోయాను. మార్కెట్‌లో ప్రతీ ఒక్కరూ నన్ను అభినందిస్తున్నారు. నా కొడుకు పట్ల నేను గర్వంగా ఉన్నా. ఉమ్రాన్ చాలా మొండివాడు. ఫాస్ట్ బౌలర్ కావాలనేది అతని ఆశయం. దాని కోసం చాలా కష్టపడ్డాడు.

తడి టెన్నిస్ బంతులతో..
జమ్మూలోని సైన్స్ కాలేజీలో తడి టెన్నిస్ బాల్స్‌తో ప్రాక్టీస్ చేసేవాడు. బంతిని వేగంగా వేసేందుకు లాంగ్ రన్నప్ ఉపయోగించేవాడు. స్థానికంగా ఉమ్రాన్ చాలా ఫేమస్. అతన్ని జట్టులోకి తీసుకునేందుకు కుర్రాళ్లు కొట్టుకునేవారు. లోకల్ మ్యాచ్‌ల్లో ఎన్నో ట్రోఫీలు సాధించాడు. కొన్నిసార్లు అతన్ని ఆడకుండా ఆపే ప్రయత్నం నేను చేసాను. కానీ అతను రిక్వెస్ట్ చేసి ఆడేవాడు. ఉమ్రాన్ మాలిక్ తండ్రిగా అందరూ నన్ను గుర్తుపడుతుండటాన్ని ఆస్వాదిస్తున్నాను.

అలా అడుగుతుంటే..
ఇక్కడి ప్రజలు, టూరిస్ట్‌లు నా దగ్గరకు వచ్చి ఉమ్రాన్ మాలిక్ తండ్రివా? అని అడుగుతుంటే గొప్పగా ఫీలవుతున్నా. ఈ ప్రపంచం మొత్తానికి అతను తెలియడం గర్వంగా ఉంది. ఇదే జోరును కొనసాగిస్తూ దేశం గర్వించేలా చేస్తాడని ఆశిస్తున్నా. మా కుటుంబంలో ఉమ్రాన్‌ను అందరూ గారభం చేస్తారు. అతని సోదరి మరీ ఎక్కువ. క్రికెట్ ఆడకుండా నేను అడ్డుపడితే ఆమె అతనికి అండగా నిలిచేది. ఉమ్రాన్ మాలిక్ సక్సెస్ కారణమైన అబ్దుల్ సమద్, ఇర్ఫాన్ పఠాన్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటా. అబ్దుల్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉమ్రాన్‌ను ఇర్ఫాన్ పఠాన్ దగ్గరకు తీసుకెళ్లింది అతనే.

ఆ ఇద్దరూ నా కొడుక్కి రెక్కలయ్యారు..
ఉమ్రాన్ కెరీర్‌లో ఇర్ఫాన్ పఠాన్ సర్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరూ ఉమ్రాన్ మాలిక్‌కు రెక్కలయ్యారు. ఉమ్రాన్ గురించి ఇర్ఫాన్ సర్ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. ఉమ్రాన్ బౌలింగ్ యాక్షన్ వకార్ యూనిస్‌లా ఉందని, అతనికి మంచి భ్యవిష్యత్తు ఉందన్నాడు. అతనే ఉమ్రాన్‌కు దగ్గరుండి నేర్పించాడు. భారత దిగ్గజ ఆటగాళ్లు అయిన ధోనీ, కోహ్లీలను ఉమ్రాన్ కలిసాడు. ఈ ఇద్దరూ టీమిండియా భవిష్యత్తు క్రికెటర్ ఉమ్రాన్ అని ప్రశంసించారు. ఈ విషయాన్ని ఉమ్రాన్ నాకు చెప్పాడు. దిగ్గజ ఆటగాళ్ల చేత ప్రశంసలు అందుకోవడం పట్ల ఉమ్రాన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడు నాకు ఉన్న కల ఒక్కటే. ఉమ్రాన్ టీమిండియాకు ఆడటం. ఏదో ఒక రోజు అతను వరల్డ్ కప్ కూడా ఆడుతాడు. అతి త్వరలోనే ఉమ్రాన్ భారత జెర్సీ ధరిస్తాడు. దేశం గర్వించేలా చేస్తాడు'అని అబ్దుల్ రషీద్ ధీమా వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications












