న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీబీఎల్: అరంగేట్రంలో అదరగొట్టిన ఏబీ డివిలియర్స్

AB de Villiers Takes Sharp Catch On Big Bash League Debut

అడిలైడ్: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమైనా.. తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు సౌతాఫ్రికా లెజెండ్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే ‌ఈ సౌతాఫ్రికా ప్లేయర్ ఫీల్డింగ్‌తోనూ మైమరిపిస్తాడు. కేవలం టీ20 లీగ్‌లు మాత్రమే ఆడుతున్న ఏబీ.. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భత క్యాచ్‌తో ఔరా అనిపించాడు.

బ్రిస్బెన్ హీట్ టీమ్ తరఫున అడిలైడ్ స్ట్రైకర్‌తో జరిగిన మ్యాచ్‌తో బీబీఎల్‌లో అరంగేట్రం చేసిన ఏబీ ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టాడు.తమ జట్టు బౌలర్ జేమ్స్ పట్టిన్సన్ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతిని అడిలైడ్ బ్యాట్స్‌మన్ ఆఫ్ సైడ్ ఆడబోగా.. ఫార్వార్డర్‌గా ఉన్న డివిలియర్స్ అద్భుత డైవ్‌తో బంతినందుకున్నాడు. దీంతో కామెంటేటర్స్..' ఏబీ బ్రిస్బెన్ హీట్‌కు స్వాగతం.. అతని అద్భుత క్యాచ్‌తో జిమ్మికి ఐదు వికెట్లు దక్కాయి.'అంటూ రిపీటెడ్‌గా వ్యాఖ్యానించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసీస్ లెజెండ్ ఆల్‌రౌండర్ అండ్రూ సైమండ్స్ చేతుల మీదుగా డివిలియర్స్ బ్రిస్బెన్ హీట్ క్యాప్ అందుకున్నాడు.

మళ్లీ తెరపైకి బేబీ సిట్టర్.. ఈ సారి పంత్ ఏం చేస్తాడో?మళ్లీ తెరపైకి బేబీ సిట్టర్.. ఈ సారి పంత్ ఏం చేస్తాడో?

ఇక బ్రిస్బెన్ కెప్టెన్ క్రిస్ లిన్‌తో కలిసి ఆడటం సంతోషంగా ఉందని ఏబీ తెలిపాడు. ‌‌'ఐపీఎల్‌లో మేం ఒకరికొకరం తెలుసు. కలిసి మాట్లాడుకున్నాం కూడా. కానీ ఇద్దరం ఒకేసారి క్రీజులోకి దిగడం ఇదే తొలిసారి. మా జోడీ కుదురుకుంటుందా లేదా అన్నది నాకు తెలియదు.

లిన్‌తో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. చాలా వరకు నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండి అతని ఆటను చూస్తాననుకుంటున్నా'అని ఏబీ తెలిపాడు. అన్ని టోర్నీల్లో ఉండే ఒత్తిడే బీబీఎల్‌లోనూ ఉంటుందన్నాడు.

ఇక 304 టీ20ల్లో డివిలియర్స్ నాలుగు సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలతో 8511 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 110 రన్స్‌కు ఆలౌటైంది. అనంతరం బ్రిస్బెన్ హీట్ 15.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి 7 వికెట్లతో గెలుపొందింది. డివిలియర్స్(40) పరుగులతో రాణించాడు.

Story first published: Tuesday, January 14, 2020, 16:01 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X