
సారథ్యం వహించమని అడగలేదు:
'దక్షిణాఫ్రికాకు మళ్లీ నాయకత్వం వహించాలంటూ బోర్డు కోరినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ రోజుల్లో ఏ వార్త నమ్మాలో తెలియడం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి' అని 36 ఏళ్ల డివిలియర్స్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. దీంతో ఏబీ మళ్లీ సారథ్యం వహించనున్నాడంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. మిస్టర్ 360 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుంచి కేవలం టీ20 లీగుల్లోనే ఆడుతూ వచ్చాడు.
ఒలింపిక్స్ నిర్వహణకు వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: ఐఓసీ

దక్షిణాఫ్రికాకు ఆడాలన్న కోరిక ఉంది:
అంతకుముందు ప్రకటనలో 'దక్షిణాఫ్రికాకు ఆడాలన్న కోరిక నాకూ ఉంది. జట్టుకు మరోసారి నాయకత్వం వహించాల్సిందిగా బోర్డు విజ్ఞప్తి చేసింది. అయితే అత్యుత్తమ ఫామ్‌లో ఉంటేనే అందుకు నేను అర్హుడను. తర్వాతి స్థానంలో ఉన్న ఆటగాడి కంటే మెరుగ్గా అనిపించాలి. జట్టులో స్థానానికి అర్హత ఉందని అనిపిస్తేనే.. స్వేచ్ఛగా ఆడగలను. గత కొంతకాలంగా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించలేదు. నాలో ఇంకా సత్తా ఉందని నాతో సహా జట్టులోని ప్రతి ఒక్కరు నమ్మడం ముఖ్యం' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.

2018లో క్రికెట్‌కు వీడ్కోలు:
డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం టీ20 లీగుల్లోనే ఆడుతూ వచ్చాడు. అయితే గతేడాది వన్డే ప్రపంచకప్ ముందు రీఎంట్రీ చేయాలనుందని తన మనసులోని కోరికను బయట పెట్టగా.. సెలెక్టర్లు అంగీకరించలేదు. అయితే ఆ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా ఘోర పరాభావానికి గురై తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లోపు జట్టులోకి ఏబీని తీసుకురావాలని గత కొంతకాలంగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు అతనితో సంప్రదింపులు జరపగా.. తనకు ఆడే సామర్థ్యం ఉంటేనే తిరిగి జట్టులోకి వస్తానని స్పష్టం చేశాడు.

ఆడినంత కాలం ఆర్‌సీబీతోనే:
కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన డివిలియర్స్ ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆటగాళ్లు పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆడినంత కాలం ఆర్‌సీబీ తరఫునే ఆడుతామన్నారు. అలాగే భారత్-దక్షిణాఫ్రికా సంయుక్త వన్డే జట్టును ఎంపిక చేసారు. ఈ జట్టుకు ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా నియమించారు.


Click it and Unblock the Notifications












