For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజస్థాన్ రాయల్స్ నుంచి రాహుల్ ద్రవిడ్‌ను వెళ్లగొట్టారు: ఏబీ డివిలియర్స్

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడం‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్రాంచైజీలో మరింత ఉన్నతమైన పదవిని ఆఫర్ చేసినా ద్రవిడ్ స్వీకరించలేదని రాజస్థాన్ రాయల్స్ చెప్పినా.. నెటిజన్లు నమ్మడం లేదు. ద్రవిడ్ నిర్ణయాలకు ఫ్రాంచైజీ విలువ ఇవ్వకపోవడంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంజూ శాంసన్‌తో నెలకొన్న విభేదాలు కూడా కారణమని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో నుంచి రాహుల్ ద్రవిడ్‌‌‌ను పొమ్మన లేక పొగ బెట్టారని తెలిపాడు. వచ్చే సీజన్ నాటికి కొత్త ఆలోచనలతో రాజస్థాన్ రాయల్స్ సిద్దమవుతుందని, అందుకు అడ్డుగా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు అత్యున్నత పదవి ఆఫర్ చేసి జట్టుకు దూరం చేయాలనుకున్నదని అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ద్రవిడ్ వ్యవహారంపై మాట్లాడిన ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

AB De Villiers Says Rahul Dravid Was Kicked Out of Rajasthan Royals

'ఫుట్‌బాల్ లీగుల్లో ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, మేనేజర్లు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. అత్యుత్తమ ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తారు. అలా జరగకపోతే మాత్రం అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తాయి. అలాగే టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి కూడా సూటి పోటీ మాటలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాహుల్ ద్రవిడ్ విషయంలో ఏం జరిగిందో తెలియదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అతనికి వేరే బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీ భావించింది. అయితే అందుకు ద్రవిడ్ అంగీకరించలేదు.అంటే అతన్ని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని రాజస్థాన్ రాయల్స్ భావించింది.

వచ్చే సీజన్ నాటికి కొత్త ఆలోచనలతో రావాలని రాజస్థాన్ భావిస్తుందేమో. అందుకోసం తమ కోచింగ్ టీమ్‌లో మార్పులకు శ్రీకారం చుట్టి ఉండొచ్చు. డగౌట్‌కు దూరం కావడం అతనికి ఇష్టం లేకపోవడం కూడా సమస్యగా మారి ఉంటుంది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలియకున్నా.. భవిష్యత్తులో తప్పకుండా తెలుస్తుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్‌ వ్యూహాలు గొప్పగా లేవు. కొన్నిసార్లు మార్పులు కలిసొస్తాయి. కానీ ఈసారి రాజస్థాన్‌కు నష్టమే ఎక్కువ కలిగింది. ఒకరిద్దరిని మారిస్తే ఇబ్బందేమి ఉండదు. కానీ, బల్క్‌గా ఆటగాళ్లను తీసేయడమనేది చాలా ప్రభావం చూపించింది.'అని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, September 1, 2025, 13:59 [IST]
Other articles published on Sep 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+