మీరు ఎంత తిట్టినా.. సచిన్ కంటే కోహ్లీనే బెస్ట్: ఏబీ డివిలియర్స్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్ అని సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ మరోసారి స్పష్టం చేశాడు. ఎన్ని విమర్శలు చేసినా.. తన అభిప్రాయం మారదని చెప్పుకొచ్చాడు. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఏబీ డివిలియర్స్.. సచిన్‌తో కోహ్లీని పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
భారత బ్యాటర్లకు విదేశాల్లో సీమింగ్ పిచ్‌లపై ఎలా ఆడాలో సచిన్ చూపిస్తే.. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ విరాట్ కోహ్లీ సచిన్‌ను మించిపోయాడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో సచిన్ గణంకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ.. కోహ్లీ కంటే స్ట్రాంగ్ కాదని చెప్పాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అడుగుజాడల్లో దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ కొనసాగుతున్నారని డివిలియర్స్ పేర్కొన్నాడు.

ఏబీ డివిలియర్స్‌పై తీవ్ర విమర్శలు..
అయితే ఈ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, దొడ్డ గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దిగ్గజాల మధ్య పోలిక తీసుకొస్తూ.. సచిన్ టెండూల్కర్‌ను అవమానించడం సరికాదని మండిపడ్డారు. ఎప్పటికీ సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాటర్ అని, అతన్ని ఎవరూ అధిగమించలేరని ఏబీడీకి చరకలంటించారు.
భారత మాజీ క్రికెటర్ల విమర్శలపై డివిలియర్స్ తాజాగా స్పందించాడు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని తెలిపాడు. 'విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ గురించి నేను చేసిన వ్యాఖ్యలు చాలా మందిని అయోమయానికి గురిచేశాయి. అది కేవలం నా అభిప్రాయం మాత్రమేనని తెలుసుకోండి. నేను ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడలేదు. నా అభిప్రాయం ఏంటో మాత్రమే చెప్పాను.
ఎంత తిట్టినా నా అభిప్రాయం మారదు..
ఇప్పటికీ ఆ అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. సచిన్ టెండూల్కర్ టీమిండియాను ముందుకు తీసుకెళ్లి.. ప్రపంచవ్యాప్తంగా నిలకడగా ఎలా ఆడాలో చూపించాడు. విరాట్ కోహ్లీ మాత్రం భిన్నమైన దారిని పరిచయం చేశాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఆడటంలో రాటు దేలాడు. వాస్తవానికి విదేశాల్లో కోహ్లీ కెరీర్ అంత గొప్పగా ఏం లేదు.
ముఖ్యంగా ఇంగ్లండ్ గడ్డపై అతను తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ అతను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వైఫల్యాల నుంచి త్వరగా తేరుకొని ముందుకు సాగేవాడు. తన వ్యక్తిత్వం, దూకుడుతో తన చుట్టూ ఉన్న ఎంతో మంది ఆటగాళ్లలో కోహ్లీ ఆత్మవిశ్వాసం నింపాడు.
గణంకాలు కాదు.. జట్టుపై ప్రభావం చూపాడు..
సచిన్‌తో పోల్చితే కోహ్లీ గణంకాలు గొప్పగా లేవనే విషయం నాకు తెలుసు. కానీ ప్రతీసారి గణంకాల కోణంలో చూడకూడదు. సచిన్ కంటే కోహ్లీనే జట్టుపై ఎక్కువ ప్రభావం చూపాడనేదే నా అభిప్రాయం. ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రాముఖ్యతతో పాటు ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు సాగాలో చెప్పడానికి కోహ్లీ చక్కటి ఉదాహరణగా నిలిచాడు.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
సచిన్ టెండూల్కర్ తన టెస్ట్ కెరీర్‌లో 51 సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు. మరే బ్యాటర్ కూడా ఇన్ని పరుగులు చేయలేదు. విదేశాల్లో 176 ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ 51 సగటుతో పరుగులు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 123 టెస్ట్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. విదేశాల్లో కోహ్లీ సగటు 68 మ్యాచ్‌ల్లో 41గా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

