సచిన్, విరాట్ కోహ్లీ ఎవరు బెస్ట్.. తేల్చేసిన ఏబీ డివిలియర్స్!
భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలో ఎవరు అత్యుత్తమం అనే చర్చ తరుచూ జరుగుతూనే ఉంటుంది. భారత క్రికెట్ ఐకాన్స్ అయిన ఈ ఇద్దరి మధ్య పోలిక అనవసరమని చాలా మంది మాజీ క్రికెటర్లు సమాధానం చెప్పేందుకు తప్పించుకున్నారు.
ఇద్దరి క్రికెటర్ల తరాలు భిన్నమైనవని, ఇద్దర్ని పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. నిర్మోహమాటంగా సమాధానం చెప్పాడు. సచిన్‌తో పోల్చితే విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డాడు.
సచిన్ కంటే కోహ్లీనే గ్రేట్..
ముఖ్యంగా టెస్ట్‌ల్లో విదేశీ గడ్డపై విరాట్ కోహ్లీ రాణించినట్లుగా సచిన్ ఆడలేకపోయాడని తెలిపాడు. విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై భారత బ్యాటింగ్ స్థాయిని పెంచారని, తన సమకాలీన ఆటగాళ్లు కూడా అక్కడి పరిస్థితుల్లో మెరుగ్గా రాణించేలా ప్రేరేపించారని ఏబీడీ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పేర్కొన్నాడు.
'విదేశాల్లో సచిన్ టెండూల్కర్ ఒక ప్రమాణాన్ని నెలకొల్పాడు. కానీ కోహ్లీ ఆ ప్రదర్శనలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. టెస్ట్ క్రికెట్‌లో 15,921 పరుగులు, 51 సెంచరీలతో సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 176 ఇన్నింగ్స్‌ల్లో విదేశీ గడ్డపై 51 సగటుతో పరుగులు చేశాడు.

మరోవైపు విరాట్ కోహ్లీ 123 టెస్ట్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. విదేశాల్లో కోహ్లీ సగటు 68 మ్యాచ్‌ల్లో 41గా ఉంది. భారత్ కోసం సచిన్ కొత్త ఒరవడిని ప్రారంభించినా.. విరాట్ కోహ్లీ అంతటి స్థాయి అప్పట్లో సచిన్‌కు లేదు. విదేశాల్లో బౌన్సీ, సీమింగ్ పిచ్‌లపై కూడా రాణించవచ్చని నిరూపించిన మొదటి వ్యక్తి సచిన్'అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ మెరుగవ్వాలి..
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అడుగుజాడల్లో దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ కొనసాగుతున్నారని డివిలియర్స్ పేర్కొన్నాడు. 'కేఎల్ రాహుల్‌కు మంచి టెక్నిక్ ఉంది. అతను భారత జట్టుకు ఒక పెద్ద ఆస్తి. కానీ విదేశాల్లో అతని సగటు కేవలం 34 మాత్రమే. ఈ విషయంలో అతను ఇంకా మెరుగవ్వాలి. క్రీజులో సెట్ అయిన తర్వాత భారీ స్కోర్లు చేయాలి. కేవలం సెంచరీలే కాకుండా డబుల్ సెంచరీలు చేయాలి. ఎందుకంటే కొత్త బంతికి ఔటవ్వడం ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి మెరుగైన ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మల్చాలి'అని డివిలియర్స్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

