Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఇదేం దిక్కుమాలిన కామెంట్రీ.. ఏబీ డివిలియర్స్ ఫైర్!

ఐపీఎల్ 2025 సీజన్ కామెంటేటర్లపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పనిగట్టుకొని ఆర్‌సీబీపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డాడు. తమ వ్యాఖ్యానంతో ఆర్‌సీబీని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో లక్నో వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించి క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లు ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 227 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఫామ్‌లో లేని రిషభ్ పంత్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో ఆర్‌సీబీ బౌలర్లపై కామెంటేటర్లు విమర్శలు గుప్పించారు. పిచ్ కండిషన్స్‌తో సంబంధం లేకుండా ఆర్‌సీబీ బౌలర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై తాజా స్పందించిన ఏబీ డివిలియర్స్.. కామెంటేటర్ల తీరును తప్పుబట్టాడు.

AB de Villiers Blasts IPL 2025 Commentators for Unfair RCB Criticism

ఏకపక్ష కామెంట్రీ..
'లక్నో మ్యాచ్‌లో కామెంటేటర్లు చేసిన వ్యాఖ్యలు నాకు కోపం తెప్పించాయి. ఆర్‌సీబీ బౌలింగ్ చేసే సమయంలో వ్యాఖ్యతలు చాలా నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడారు. వారు వారు పదే పదే ఆర్‌సీబీ బౌలర్లు ఒత్తిడిలో ఉన్నారని, పరుగులను నియంత్రించలేకపోతున్నారని, మరోసారి ఆర్‌సీబీ తేలిపోతుందని అన్నారు. ఈ మాటలు నాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అది మంచి బ్యాటింగ్ పిచ్ అని కామెంటేటర్లకు తెలియదా? ఆర్‌సీబీ బౌలింగ్ విభాగం పేలవమై ఫామ్‌లో ఉందని చెప్పారు. కామెంటేటర్లు ఆర్‌సీబీని తక్కువ అంచనా వేస్తున్నారు.

రిషభ్ పంత్ సెంచరీ చేసేవాడా..?
ఆర్‌సీబీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. కానీ మైదానంలో ఏం జరుగుతుందో సరిగ్గా విశ్లేషించుకుండా విమర్శలు గుప్పించడం సరికాదు. పిచ్ కఠినంగా ఉంటే రిషభ్ పంత్ సెంచరీ చేసేవాడు కాదు. పంత్‌తో పాటు లక్నో బ్యాటర్లంతా ఈజీగా బ్యాటింగ్ చేశారు. ఆర్‌సీబీ బౌలర్లు కొన్నిసార్లు విఫలమయ్యారు. కాదనలేదు. కానీ పిచ్ కండిషన్స్‌ను పట్టించుకోకుండా మాట్లాడటం సరికాదు. సాధారణంగా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండే వికెట్‌పై 227 పరుగులు వచ్చాయంటనే వికెట్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఆర్‌సీబీ ఇంకా పోటీలో ఉందనే విషయం తెలిసి కూడా మ్యాచ్ పోయినట్లు మాట్లాడారు. కానీ ఆర్‌సీబీ తమ సత్తా ఏంటో చూపించింది. తమ ఆటతోనే కామెంటేటర్ల నోళ్లు మూయించింది.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, May 29, 2025, 17:53 [IST]
Other articles published on May 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+