Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AB De Villiers: అది ధోనీ చేసిన ఘోర తప్పిదం!

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సారథ్య బాద్యతల నుంచి తప్పుకోవడం ధోనీ చేసిన ఘోర తప్పిదమని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో జియో సినిమా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఏబీ డివిలియర్స్.. ప్రీ మ్యాచ్ షోలో.. సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్, బ్రెట్‌లీలతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నిజాయితీగా చెప్పాలంటే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడం ఘోర తప్పిదం. గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిందో మనమంతా చూశాం.'అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

AB de Villiers believes MS Dhoni stepping down as captain is a huge mistake ahead of IPL 2024

'నా జెర్సీ నెంబర్ 17. ఇది 17వ ఐపీఎల్ సీజన్. కాబట్టి ఈ సారి ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్నా.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పును కూడా డివిలియర్స్ తప్పుబట్టాడు. 'కెప్టెన్‌ను మార్చి ముంబై ఇండియన్స్ ఘోర తప్పిదం చేసింది. ముంబై ఫ్యాన్స్, రోహిత్ శర్మ అభిమానులంతా హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా మారారు. ఇది జట్టు విజయాలపై ప్రభావం చూపనుంది.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఆర్‌సీబీకి, తన క్లోజ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీకి ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశాడు. 'గుడ్ లక్ మై బిస్కట్.. కమాన్ ఆర్‌సీబీ'అని కోహ్లీతో ఉన్న ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.

ఇక ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తప్పిదమేనని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా అన్నాడు. పూర్తిగా జట్టుకు దూరమైనప్పుడే ఈ నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ధోనీ వికెట్ కీపర్‌గా ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేడని, రవీంద్ర జడేజా కూడా ఇలానే అనవసర ఒత్తిడికి గురయ్యాడని తెలిపాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకునే బదులు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తమ సారథిగా రుతురాజ్ గైక్వాడ్‌ను నియమించిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ తన సారథ్య బాధ్యతలను గైక్వాడ్‌కు అప్పజెప్పాడని ఆ జట్టు ప్రకటించింది. ఆర్‌సీబీతో మరికాసేపట్లో ప్రారంభమయ్యే సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో సీఎస్‌కే అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Friday, March 22, 2024, 19:02 [IST]
Other articles published on Mar 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+