Dale Steyn: క్రికెట్ చూసిన గొప్ప ఆటగాళ్లలో నువ్వూ ఒకడివి!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మంగళవారం క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ట్విటర్ ద్వారా ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్‌బౌలర్ క్రికెట్‌లోని వేగవంతమైన బౌలర్లలో ఒకడు. సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు ఆడిన స్టెయిన్.. 439 వికెట్లు తీశాడు. తన రిటైర్మెంటన్ ప్రకటనను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. తనకెంతో ఇష్టమైన గేమ్ నుంచి ఇవాళ రిటైరవుతున్నట్లు చెప్పాడు. 20 ఏళ్ల పాటు ట్రైనింగ్, ప్రయాణాలు, గెలుపులు, ఓటములు అంటూ తీరక లేకుండా గడిపానని, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని తన ప్రటనలో స్టెయిన్ అన్నాడు.

నీ రెండో ఇన్నింగ్స్..
ఇక డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌పై స్పందించిన పలువురు క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. క్రికెట్‌లో అరుదైన వ్యక్తి అని కొనియాడుతున్నారు.
'గో వెల్ గ్రేట్ మ్యాన్. నువ్వు బౌలింగ్ చేసేటప్పుడు నిప్పులు చెరిగేవాడివి. క్రికెట్ చూసిన గొప్ప ఆటగాళ్లలో నువ్వూ ఒకడివి.'అంటూ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'స్టెయిన్ నీ అత్యద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. నువ్వు సాధించినదానికి మిక్కిలి గర్వపడొచ్చు. నీ రెండో ఇన్నింగ్స్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా.'అని సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

నా ఆల్‌టైమ్ ఫేవరేట్..
'నా ఆల్‌టైమ్ ఫేవరేట్ క్రికెటర్ మీరు. మీకంతా మంచే జరగాలి'అని హార్దిక్ పాండ్యా ఆకాంక్షించగా.. 'ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ కన్నా మేటి బౌలర్ లేడు. త్వరలోనే నిన్ను కలుస్తా దిగ్గజం.'అని కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. 'డేల్.. నీ కెరీర్ ఎంత అద్భుతమైనది..! ఎన్నోసార్లు నా ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టినందుకు ధన్యవాదాలు.'అని మైఖేల్ వాన్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 'మీలాంటి అరుదైన కెరీర్‌కు అభినందనలు. సుమారు 20 ఏళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాస్ట్ బౌలర్లకు ఒక ప్రేరణగా నిలిచారు. మీలాంటి యాక్షన్ బౌలింగ్ ఎవరికీ లేదు.'అని పాట్ కమిన్స్ కొనియాడాడు.

2019లో చివరి టెస్ట్..
'గొప్ప ఆటగాడు. మనసున్న మంచోడు. ఎప్పటికి గుర్తుండే మధుర జ్ఞాపకాలు మిగిల్చావు.'అని ఏబీ డివిలియర్స్ ట్వీట్ చేయగా.. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అది మైదానమైనా, బయటైనా.. ఎక్కడైనా ఒక్కటే.'అని మహేలా జయవర్దెనె పేర్కొన్నాడు. 2019, ఫిబ్రవరిలో చివరి టెస్ట్ ఆడిన స్టెయిన్.. అదే ఏడాది ఆగస్ట్‌లో టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. ఇక చివరి వన్డేను 2019 మార్చిలో, చివరి టీ20ని గతేడాది ఫిబ్రవరిలో ఆడాడు. గతేడాది ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఆడిన స్టెయిన్.. కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడలేదు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స్టెయిన్.. 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications