అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 టైటిల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) గెలుచుకుంటుందని ఆ జట్టు మాజీ ప్లేయర్, సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. మరికొద్ది సేపట్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. జియో సినిమా ప్రీ మ్యాచ్ షోలో క్రిస్ గేల్‌తో కలిసి ఏబీ డివిలియర్స్ సందడి చేశాడు.
జియో సినిమా ఇంగ్లీష్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గేల్, ఏబీడీ ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు తమ అంచనాలను వెల్లడించారు. ముందుగా ఏబీ డివిలియర్స్ ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేసాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టైటిల్ కొడుతుందని చెప్పిన ఏబీడీ.. ఆ జట్టుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరుతాయని అంచనా వేసాడు. ఈ నాలుగు జట్లు చాలా బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ పేరును ఏబీడీ ప్రస్తావించలేదు.
మరోవైపు క్రిస్ గేల్ మాత్రం ఈ సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుస్తుందని చెప్పాడు. ముంబైతో పాటు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరుతాయని తెలిపాడు. తన మాజీ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పేరును మాత్రం క్రిస్ గేల్ ప్రస్తావించలేదు.
జియో సినిమా కామెంటేటర్లుగా ఏబీడీ, క్రిస్ గేల్‌తో పాటు అనిల్ కుంబ్లే, గ్రేమ్ స్వాన్, రాబిన్ ఊతప్ప, ఇయాన్ మోర్గాన్, బ్రెట్‌లీ, స్కాట్ స్టైరీస్ వ్యవహరించనున్నారు. కామెంట్రీతో పాటు మ్యాచ్‌లు జరిగిన తీరుపై తమ విశ్లేషణలను జియో సినిమా ప్రేక్షకులతో పంచుకోనున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన ఆరంభ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ వేడుకలకు మందిరా బేడీ హోస్ట్‌గా వ్యవహరించగా.. సింగర్ అర్జిత్ సింగ్ తన పాటతో వేడుకలను ప్రారంభించాడు. ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఈ వేడుకలకుబీసీసీఐ సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు.