For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aaron George: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు.. 14 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బద్దలు!

Aaron George: భారత అండర్ 19 ఓపెనర్, హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115) సెంచరీ చేయడం ద్వారా ఆరోన్ జార్జ్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ క్రమంలో 14 ఏళ్ల వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. భారత మాజీ అండర్ 19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 2012 ఫైనల్లో ఆస్ట్రేలియాపై 111 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్ ఛేజింగ్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా మ్యాచ్‌లో ఆరోన్ జార్జ్ 115 పరుగులతో అతన్ని అధిగమించాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్(105) రికార్డ్‌ను కూడా ఈ హైదరాబాద్ కుర్రాడు బ్రేక్ చేశాడు. 2020 అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై యశస్వి జైస్వాల్ 105 పరుగులు చేశాడు.

Aaron George Breaks Yashasvi Jaiswal Record With Historic Knock in U19 World Cup Chase

రికార్డ్ ఛేజింగ్..

ఆరోన్ జార్జ్ అద్భుత సెంచరీకి తోడుగా వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68), ఆయుష్ మాత్రే(59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది. యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది రికార్డ్ ఛేజ్.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఫైసల్ షినోజాడా(93 బంతుల్లో 15 ఫోర్లతో 110), ఉజైరుల్లా నియాజై(86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీపేష్ దేవండ్రైన్(2/64), కాన్షిక్ చౌహన్(2/55) రెండేసి వికెట్లు తీసారు. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.

హైదరాబాద్ కుర్రాడు..

ఆరోన్ జార్జ్ పూర్తిపేరు ఆరోన్ జార్జ్ వర్గీస్. కేరళలోని కొట్టాయంలో జన్మించాడు. అయితే, వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. దాంతో అతను హైదరాబాద్‌లోనే పెరిగాడు. హైదరాబాద్‌లోని నాచారం 'ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆరోన్ జార్జ్.. ప్రస్తుతం భవన్స్‌ కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆరోన్ జార్జ్ తండ్రి పేరు ఈసో వర్గీస్. ఆయన కూడా క్రికెటర్ అవ్వాలని కలలు కన్నారు. కానీ సాధ్యం కాలేదు. దాంతో తన కొడుకు ద్వారా ఆ కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మొదట పోలీస్ శాఖలో పనిచేసి, ఆ తర్వాత కార్పొరేట్ రంగంలోకి మారారు.

గతేడాది జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఆరోన్ జార్జ్.. పాకిస్థాన్‌పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆరోన్ జార్జ్.. ఆఫ్-బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అతని ఆరాధ్య దైవం.

Story first published: Thursday, February 5, 2026, 7:05 [IST]
Other articles published on Feb 5, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+