అలా చేస్తే కచ్చితంగా గెలిచేవాళ్లం: ఆసీస్ కెప్టెన్

బెంగళూరు: భారత్‌తో జరిగిన చివరి వన్డేలో 300కు పైగా స్కోర్ చేసి ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్లతో ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఫించ్ మాట్లాడుతూ తమ ఓటమికిగల కారణాలను విశ్లేషించాడు.
'పిచ్‌పై బంతి బాగా టర్న్ అయింది. దీంతో చివరి వరకూ స్పిన్‌కు అనుకూలంగానే ఉంది. కానీ మేము సాధించిన స్కోరు భారీ స్కోరు కాదు. ఒకవేళ మేం 300 లేదా 310 పరుగులు చేసి ఉంటే మా స్పిన్నర్లు పోరాడేవారు. ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి తెచ్చేవారు. మేము స్వల్ప విరామాల్లో రెండేసి వికెట్లను కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయాం. ప్రపంచ అత్యుత్తమ జట్టుతో వారి సొంతగడ్డపై ఆడటం గొప్ప అనుభవాన్నిచ్చింది.'అని ఫించ్ చెప్పుకొచ్చాడు.

అదే తేడా..
‘ఈ మ్యాచ్‌లో అగర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. కానీ భారత ఆటగాళ్లు ఎలాంటి తప్పిదాలు చేయకుండా అద్భుతంగా ఆడారు. దీంతోనే వికెట్లు దక్కలేదు. ఇదే మాకు భారత్‌కు ఉన్న తేడా అనుకుంటుననా. ఏదిఏమైనప్పటికి ఓ గొప్ప సిరీస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది.'అని ఆసీస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

అది వర్కౌట్ కాలేదు..
‘పార్ట్‌టైమ్ స్పిన్నర్లుగా నేను, లబుషేన్ బౌలింగ్ చేసినా ఆ ప్రణాళికా వర్కౌట్ కాలేదు. ఓటమి మాకు చాలా విషయాలు నేర్పింది. భారత్ స్వదేశంలో ఎంతటి గట్టి జట్టు మరోసారి చూపించింది. వరల్డ్ అత్యుత్తమ జట్టును, అందులోనే వారి సొంత గడ్డపై ఓడించమంటే మాకు తెలిసొచ్చింది' అని ఫించ్ అన్నాడు.

అత్యుత్త బ్యాట్స్‌మెన్..
‘ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మెన్ భారత్ సొంతం. ఆల్‌టైమ్ వన్డే ప్లేయర్ కోహ్లీ అయితే.. ఆల్‌టైమ్ టాప్-5 బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ ఒకడు. శిఖర్ ధావన్ లేకున్నా రోహిత్ సెంచరీతో చెలరేగడం మమ్మల్ని దెబ్బతీసింది. ఇక రాజ్‌కోట్ వన్డేలో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి మా విజయాన్ని లాక్కున్నాడు. భారత డెత్ బౌలింగ్ కూడా సూపర్. షమీ, సైనీ, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి బౌలింగ్ చూశాక మేం మెరుగవ్వాలనిపించింది. ఈ గెలుపు క్రెడిట్ భారత్‌దే'టీమిండియా భారత్ డెత్ బౌలింగ్‌పై ఫించ్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఫించ్ రనౌట్..
ఈ మ్యాచ్‌లో ఫించ్ రనౌట్‌లో ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఈ సిరీస్‌లో సెంచరీతో మంచి ఫామ్‌లో ఉన్న ఫించ్.. సహచర ఆటగాడు స్టీవ్ స్మిత్ వల్ల రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సెంచరీతో స్మిత్, హాఫ్ సెంచరీతో లబుషేన్ ఆదుకున్నా.. చివర్లో భారత బౌలర్లు చెలరేగడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications