For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం: ఆరోన్ ఫించ్

Aaron Finch says Rohit played brilliantly

కాన్పూర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ అక్షర్ పటేల్ కారణంగానే రెండో టీ20లో ఓటమిపాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. ఈ ఇద్దరూ తమ విజయాన్ని లాగేసుకున్నారని చెప్పాడు. ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా 8 ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఆరోన్ ఫించ్.. అక్షర్ పటేల్ తన సూపర్ బౌలింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడని చెప్పాడు.

'సాధారణంగా ఇలాంటి ప్రతి కూల పరిస్థితుల్లో 5 ఓవర్ల మ్యాచ్ చూస్తుంటాం. కానీ ఈ మ్యాచ్ దాని కంటె కొంచెం ఎక్కువ. ప్రపంచకప్ సన్నాహకల్లో ఉన్నప్పుడు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడం చాలా ముఖ్యం. మేం ఆ పనిని సమర్థవంతంగా చేస్తున్నాం. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా ఆడాడు. ఇక అక్షర్ పటేల్ తన రెండు ఓవర్లతో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. మాథ్యూ వేడ్ మరోసారి తన సత్తా ఏంటో తెలియజేశాడు. ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు. జంపా సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు'అని ఫించ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.

అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్, ఫోర్‌తో 10 నాటౌట్) అసలు సిసలు ఫినిషింగ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, September 23, 2022, 23:38 [IST]
Other articles published on Sep 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+