For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేనందుకు బాధలేదు: ఆరోన్ ఫించ్

Aaron Finch Reacts After Going Unsold In IPL 2021 Player Auction
IPL 2021 Auction : Aaron Finch Reacts After Going Unsold In IPL 2021 | Oneindia Telugu

క్రైస్ట్‌చర్చ్: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మరికొంత టైమ్ ఇంటి వద్ద గడపడం పెద్ద సమస్యేమీ కాదన్నాడు. వీలైనంత త్వరగా తాను ఫామ్‌లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈలో జరిగిన లీగ్‌లో ఫించ్ బెంగళూరు తరఫున ఒకే ఒక్క ఫిఫ్టీ చేశాడు. బిగ్‌బాష్‌లోనూ 13 మ్యాచ్‌ల్లో 179 రన్సే చేయడంతో ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు.

'ఐపీఎల్‌లో ఆడి ఉంటే బాగుండేది. చాలా పెద్ద టోర్నీ మంచి కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఈ సారి నాకు ఆ అదృష్టం లేదు. అయితే నన్నెవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేయలేదు. నిజాయితీగా చెబుతున్నా. క్రికెట్ ఆడటానికి ప్రాధాన్యత ఇస్తా. లేకపోయినా ఇంటి దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడతా. ఆగస్ట్ నుంచి ఫుల్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాం. యూకేలో దిగినప్పట్నించి క్వారంటైన్, బబుల్‌లోనే కొనసాగుతున్నాం. కాస్త బోరింగ్‌గా ఉంది కాబట్టి ఐపీఎల్ బ్రేక్‌ను ఫ్యామిలీతో గడుపుతా'అని ఫించ్ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ 2021 వేలం హాట్ హాట్ గా సాగింది. ఈ సారి ఆల్ రౌండర్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాయ్ ఐపీఎల్ ఫ్రాంచైజీలు. విదేశీ ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో వెచ్చించాయ్. 292 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా..57 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఈ మినీ వేలంలో 8 ఫ్రాంచైజీలు రూ. 145 కోట్ల 30లక్షలను ఖర్చు చేశాయి.

అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్ల జాబితా..

1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)

2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్)

3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)

4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)

5. హనుమ విహారీ(భారత్)

6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)

7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్)

8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)

9. డారెన్ బ్రావో(వెస్టిండీస్)

10. కోరె అండర్సన్(న్యూజిలాండ్)

11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)

12. వరుణ్ ఆరోన్ (భారత్)

13. మోహిత్ శర్మ(భారత్)

14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్)

15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా)

16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)

Story first published: Monday, February 22, 2021, 11:09 [IST]
Other articles published on Feb 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+