Aaron Finch: కేకేఆర్‌లోకి ఆసీస్ కెప్టెన్.. 11 సీజన్లు.. 9 ఫ్రాంచైజీలు!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని జాబితాలో నిలిచిన ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు అదృష్టం కలిసివచ్చింది. లీగ్ ప్రారంభానికి ముంగిట కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)కు చెందిన ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్ బయో బబుల్ భయంతో తప్పుకున్నాడు. బబుల్ వాతావరణంతో తాను ఉండలేనని, ఈ సీజన్ ఐపీఎల్ ఆడాలనుకోవడం లేదని ఫ్రాంచైజీకి తెలియజేశాడు.
దాంతో అతన్ని వదిలేసిన కేకేఆర్.. అతని స్థానంలో ఆరోన్ ఫించ్‌ను తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలెక్స్ హేల్స్ స్థానంలో ఫించ్‌ను తీసుకుంటున్నామని ట్వీట్ చేసింది.
ఫించ్‌కు లక్కీ చాన్స్..
మెగా వేలంలో అలెక్స్ హేల్స్ కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేసిన కేకేఆర్ అంతే ధరకు ఆరోన్ ఫించ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఆసీస్ కెప్టెన్‌కు మళ్లీ ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. ఫించ్ చివరిసారిగా 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు ప్రాతినిథ్యం వహించాడు.
ఆ సీజన్‌లో అతను దారుణంగా విఫలమవడంతో గతేడాది జరిగిన మినీ వేలానికి ముందు ఆర్‌సీబీ ఫించ్‌ను వదిలేసింది. వయసు, పేలవ ఫామ్ నేపథ్యంలో గతేడాదే ఫ్రాంచైజీలు ఫించ్‌ను తీసుకోవడానికి ఆసక్తికనబర్చలేదు.
కేకేఆర్..9వ ఫ్రాంచైజీ..
మెగా వేలంలోనూ కోటిన్నర బేస్ ప్రైజ్‌తో అందుబాటులో ఉన్నా.. ఫ్రాంచైజీలు కనుకరించలేదు. చివరకు అలెక్స్ హేల్స్ రూపంలో అతనికి మంచి అవకాశం దక్కింది. దాంతో ఆరోన్ ఫించ్ ఐపీఎల్‌లో 9వ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. 2010లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 35 ఏళ్ల ఫించ్.. ఇప్పటి వరకు 10 సీజన్లు ఆడాడు. ఈ 10 సీజన్లలో 8 ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పుణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన ఫించ్.. తన 11వ సీజన్‌లో కేకేఆర్‌కు ఆడనున్నాడు.

ఆరంభ మ్యాచ్‌లకు దూరం..
ఫించ్ ఐపీఎల్ కెరీర్లో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడి 25.7 సగటున, 127.7 స్ట్రైయిక్‌రేట్‌తో 2005 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసీస్ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహిస్తున్న ఫించ్.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. మెగా లీగ్ ప్రారంభ సమయానికి ఫించ్ పాకిస్థాన్ పర్యటనలో ఉండనున్నాడు. ఏప్రిల్ 6 వరకు ఆస్ట్రేలియా.. పాక్‌తో 3 వన్డేలు, ఏకైక టీ20 ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లు ముగిసిన తర్వాతే ఫించ్ ఐపీఎల్ కోసం భారత్‌కు రానున్నాడు. ఈ లెక్కన అతను ఏప్రిల్ 11 నుంచి టీమ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications