
ఇప్పుడేమంటారు డ్యూడ్స్?
నిలకడలేమి ఫామ్‌తో గతకొంతకాలంగా ఇబ్బంది పడ్డ డేవిడ్ వార్నర్ పనైపోయిందన్న విమర్శకులు ఇప్పుడేం అంటారని ప్రశ్నించాడు. క్లిష్ట సమయాల్లోనే డేవిడ్ వార్నర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్నోఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. 'చాలా గర్వంగా ఉంది. టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా తొలి జట్టుగా మేము నిలిచాం. టైటిల్ సాధించడం అంత తేలికైన విషయం కాదు అని మాకు తెలుసు.

సమష్టి విజయం..
వ్యక్తిగతంగా, సమష్టిగా ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం. వార్నర్ పని అయిపోయిందంటూ చాలా మంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే అతను అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం జంపా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. మార్ష్ ఈరోజు అద్భుతంగా ఆడాడు. వేడ్ గాయం కారణంగా ఇబ్బంది పడగా స్టొయినిస్ తన పనిని పూర్తి చేశాడు''అని ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు.

మ్యాన్ ఆఫ్ ద టోర్నీ వార్నర్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు.


Click it and Unblock the Notifications












