Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన ఘనతతో రోహిత్ శర్మ సరసన ఆరోన్ ఫించ్!

Aaron Finch Becomes First Australia Batsman To Hit 100 Sixes In T20Is

వెల్లింగ్టన్: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఫించ్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ 135 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ (127), ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (113), న్యూజిలాండ్ ప్లేయర్ కోలిన్ మన్రో (107), వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ (105) ఉన్నారు.

ఇక టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా ఫించ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకు టాప్‌లో ఉండగా.. తాజాగా అతన్ని ఫించ్ అధిగమించాడు. వార్నర్ 81 మ్యాచ్‌ల్లో 2,265 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫించ్ 70 ఇన్సింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, 14 అర్థ సెంచరీల సాయంతో 2,310 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో పింఛ్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫించ్ కెప్టెన్ ఇన్సింగ్స్‌తో ఆస్ట్రేలియా 50 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. కివీస్‌ ఆటగాళ్లలో కేల్‌ జెమీసన్‌(30; 5 ఫోర్లు 18 బంతుల్లో) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కేన్‌ రిచర్డ్‌సన్‌ మూడు వికెట్లు తీయగా, గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా, ఆస్టన్‌ ఆగర్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-2తో సమంగా నిలిచింది.

Story first published: Friday, March 5, 2021, 21:08 [IST]
Other articles published on Mar 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+