కెప్టెన్సీకి స్మిత్ కన్నా డేవిడ్ వార్నర్ 100 రెట్లు నయం.. నా మద్దతు అతనికే: ఆరోన్ ఫించ్

సిడ్నీ: ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నరే సరైనోడని ఆ జట్టు టీ20 సారథి ఆరోన్ ఫించ్ అన్నాడు. కెప్టెన్ వార్నర్‌కు సాటిలేరని, క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని సారథిగా ఎంపికచేయాలని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫించ్.. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. దాంతో ఆస్ట్రేలియా తదుపరి వన్డే కెప్టెన్ ఎవరా? అనే చర్చ ఊపందుకుంది. రేసులో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నారు.

వార్నర్‌పై ఆ నిషేధం ఎత్తేయాలి..
డేవిడ్ వార్నర్‌కు కూడా సారథ్యం ఇవ్వాలనే డిమాండ్ గతకొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే బాల్ టాంపరింగ్ ఉదంతంతో జీవిత కాలం కెప్టెన్ కాకుండా అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం సరైంది కాదని, ఎత్తేయాలని ఇప్పటికే చాలా మంది ఆసీస్ మాజీ ఆటగాళ్లతో పాటు డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరుతుంది. చేసిన తప్పిదానికి వార్నర్ శిక్ష కూడా అనుభవించాడని, అతనిపై వివక్ష చూపవద్దని, స్మిత్‌లా కెప్టెన్సీ చేసే అవకాశం ఇవ్వాలని వార్నర్ సన్నిహితులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోన్ ఫించ్.. వార్నర్‌కు మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.

వార్నర్ అద్భుతమైన సారథి..
'డేవిడ్ వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా పునరాలోచన చేస్తుందని అనుకుంటున్నా. గతంలో కొన్నిసార్లు అతని సారథ్యంలో ఆడే అవకాశం నాకు దక్కింది. అతనో అద్భుతమైన సారథి. మైదానంలో అతని వ్యూహాలు, పరిస్థితులకు తగ్గట్లు తీసుకునే నిర్ణయాలు అసాధారణంగా ఉంటాయి. జట్టులోని ఆటగాళ్లంతా అతని సారథ్యంలో ఆడేందుకు తెగ ఇష్టపడుతారు. అయితే సీఏ ఏం ఆలోచిస్తుందో అనే విషయం నాకు తెలియదు. కానీ వార్నర్‌ను సారథిగా ఎంపిక చేయడం ఉత్తమమనేది నా అభిప్రాయం.

ఘోర వైఫల్యంతో..
కాగా గత కొంత కాలంగా వన్డేల్లో ఫించ్ దారుణంగా విఫలమవుతున్నాడు. అతను తన చివరి 8 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ 2013లో శ్రీలంకపై ఆసీస్ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన అతని కెరీర్ చివరి వన్డేలోనూ ఫించ్ 5 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు.

ఘనమైన కెరీర్..
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 146 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఫించ్.. 5046 పరుగులు సాధించాడు. 54 వన్డేల్లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ఫించ్ వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 17 సెంచరీలు,30 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక ఫించ్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనికి మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. అతని భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా... 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరింది. కెప్టెన్‌గా టీ20ల్లో 65 మ్యాచులు ఆడి 35 విజయాలు అందుకున్న ఆరోన్ ఫించ్, 52 వన్డేల్లో 28 విజయాలు అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications