Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే ఫార్మాట్‌కు టాటా చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్.. కొత్త సారథిగా ఆర్‌సీబీ హిట్టర్!

Aaron Finch announces retirement from ODIs, to continue as T20I captain

సిడ్నీ: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీసే కెరీర్‌లో తనకు చివరని పేర్కొన్నాడు. మూడో వన్డే నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఫించ్ అతన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆదివారం కైర్న్స్‌ వేదికగా జరగనున్న మూడో వన్డే ఫించ్ కెరీర్‌లో అఖరి వన్డే కానుంది. టీ20లపై మరింత ఫోకస్ పెట్టేందుకే ఫించ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'ఆస్ట్రేలియా వంటి అద్భుతమైన జట్టులో భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఆసీస్‌ జట్టుతో నా జర్నీలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ రోజు వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన క్రికెట్‌ ఆస్ట్రేలియా, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.' అని ఫించ్‌ పేర్కొన్నాడు.

కాగా గత కొంత కాలంగా వన్డేల్లో ఫించ్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. అతను తన చివరి ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్‌ 2013లో శ్రీలంకపై ఆసీస్‌ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 145 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఫించ్‌.. 5041 పరుగులు సాధించాడు. 54 వన్డేల్లో ఆసీస్‌ జట్టు కెప్టెన్‌గా ఫించ్‌ వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 17 సెంచరీలు,30 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక ఫించ్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనికి మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. అతని భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా... 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌ చేరింది. కెప్టెన్‌గా టీ20ల్లో 65 మ్యాచులు ఆడి 35 విజయాలు అందుకున్న ఆరోన్ ఫించ్, 52 వన్డేల్లో 28 విజయాలు అందించాడు.

ఆర్‌సీబీ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు డేవిడ్ వార్నర్ పేర్లు ఆసీస్ తర్వాతి కెప్టెన్ పోటీదారులుగా వినిపిస్తున్నాయి. అయితే సాండ్‌పేపర్ వివాదం తర్వాత డేవిడ్ వార్నర్‌, మళ్లీ కెప్టెన్సీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

Story first published: Saturday, September 10, 2022, 15:00 [IST]
Other articles published on Sep 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+