షాహిన్ ప్రపంచకప్‌కు దూరంగా ఉండు.. రిస్క్ వద్దు బిడ్డా: పాక్ మాజీ క్రికెటర్

కరాచీ: టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది గాయపడటం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గాయం కారణంగా షాహిన్ ఆసియాకప్ 2022కు దూరమయ్యాడు. ప్రస్తుతం లండన్‌లో మోకాలి గాయానికి చికిత్స తీసుకుంటున్న షాహిన్ అఫ్రిది గాయంపై సందేహాలు నెలకొన్నాయి. అతను పూర్తిగా కోలుకోకున్నా.. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసారనే ప్రచారం జరుగుతోంది. ప్రపంచకప్ వరకు కోలుకుంటాడనే ఉద్దేశంతోనే పీసీబీ అతన్ని ఎంపిక చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

రిస్క్ వద్దు బిడ్డా..
అయితే ప్రపంచకప్‌కు ఇంకా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అసలు అప్పటివరకైనా షాహీన్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడా..? కోలుకున్నా ఆటకు ఫిట్ గా ఉంటాడా..? లేదా.?? అనేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఆసిక్తకర వ్యాఖ్యలు చేశాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ ఆడకపోవడమే మంచిదని షాహీన్ అఫ్రిదికి సూచించాడు.ఈ ఒక్క ప్రపంచకప్ కోసం చూసుకుంటే కెరీర్ మొత్తం దూరమయ్యే అవకాశం ఉందన్నాడు. షాహిద్ లాంటి బౌలర్లు చాలా అరుదని పేర్కొన్న జావెద్.. ప్రపంచకప్ కంటే అతనే విలువైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్ కంటే..
'షాహీన్ అఫ్రిది వంటి బౌలర్లు అరుదుగా ఉంటారు. అటువంటి వారిని తయారుచేయడం కష్టం. షాహీన్‌కు నేనిచ్చే సలహా ఏంటంటే.. అతడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక్క ప్రపంచకప్ కోసం అతన్ని ఆడించి.. మళ్లీ జరగరానిదేమైనా జరిగితే అతని కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అది మరింత ప్రమాదకరం. ఒక్క వరల్డ్ కప్ కోసం చూసుకుంటే షాహీన్ వంటి బౌలర్లు మళ్లీ దొరకరు. షాహీన్ పాకిస్థాన్‌కు ప్రపంచకప్ కంటే ఎంతో ముఖ్యమైన ఆటగాడు.. ఆ విషయం గుర్తుంచుకోవాలి.' అని అన్నాడు.

స్పెషలిస్ట్‌ల పర్యవేక్షణలో..
ప్రస్తుతం లండన్‌లో మోకాలి వైద్యం తీసుకుంటున్న షాహీన్.. పొట్టి ప్రపంచకప్ వరకు అందుబాటులో ఉంటాడని పాకిస్తాన్ ఆశిస్తున్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైద్య సిబ్బంది అతని ఆరోగ్య పరిస్థితిపై బోర్డుకు నిత్యం సమీక్షలు పంపుతున్నది. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు, గతంలో లివర్ పూల్ ఫుట్‌బాల్ క్లబ్, కెంట్ క్రికెట్ క్లబ్ కు మెడికల్ చీఫ్ గా పనిచేసిన డాక్టర్ జాఫర్, క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్ హెడ్ డాక్టర్ ఇంతియాజ్ వద్ద చికిత్స పొందుతున్నాడు. వీళ్ల పర్యవేక్షణలో షాహీన్ కోలుకుంటున్నాడని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications