Aakash Chopra: ఏమైంది ఒక్కడు మాట్లాడడే.. ఇదే పని భారత్ చేసుంటే!

న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే ది హండ్రెడ్ లీగ్‌ను నిర్వహించడాన్ని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. ప్రతిష్టాత్మక సిరీస్‌ను పక్కనపెట్టి హండ్రెడ్ లీగ్ కోసం ఆటగాళ్లను వదిలేయడం సరికాదన్నాడు. ఈ విషయంపై క్రికెట్ విమర్శకులు నోరు మెదపడంలేదని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తాడు. అదే పని భారత్ చేసి ఉంటే ఈపాటికి ప్రపంచంలోని విమర్శకులంతా వేలెత్తి చూపేవాళ్లని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో హండ్రెడ్ క్రికెట్ లీగ్ కూడా కీలక దశకు చేరుకుంది. అయితే, ఆ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్, సదరన్ బ్రేవ్ జట్లకు మోయిన్ అలీ, క్రేజ్ ఓవర్టన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

భారత్ చేసుంటే..
భారత్‌తో మూడో టెస్టుకు ముందు వారం రోజుల విరామం దొరకడంతో ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం వారిద్దరినీ ఆ లీగ్‌లో పాల్గొనడానికి అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలోనే చోప్రా స్పందిస్తూ.. ఇంగ్లాండ్ చేసిన పనే బీసీసీఐ, టీమిండియా చేసి ఉంటే ఈపాటికి విమర్శకులంతా ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారని అన్నాడు. 'టెస్టు సిరీస్ మధ్యలో బీసీసీఐ కూడా ఇలాగే ఐపీఎల్ కీలక దశను ఖరారు చేసి ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఈపాటికి ప్రపంచం మొత్తం భారత క్రికెట్‌ను విమర్శిస్తూ ఉండేది. డబ్బు కోసం ఏదైనా చేస్తుందని అనేవాళ్లు' అంటూ ఆకాశ్ చోప్రా వరుస ట్వీట్లలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై ధ్వజమెత్తాడు.

క్వాలీటీ లేదు..
అంతకుముందు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా ఇంగ్లండ్ జట్టు ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులో క్వాంటిటీ ఎక్కువ క్వాలిటీ తక్కువగా ఉందన్నాడు. 'ఇంగ్లండ్‌కు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆ జట్టు పరిస్థితి క్వాంటిటీ ఎక్కువ.. క్వాలిటీ తక్కువ అన్నట్లుగా ఉంది. ఒకే ఒక్క నాణ్యమైన ప్లేయర్ ఉన్నాడు. అతను బ్యాట్స్‌మెన్ జోరూట్. భారత భీకర బౌలింగ్ లైనప్ ముందు మిగతా ఆటగాళ్లంతా కేవలం జట్టులో అంకేలుగా మాత్రమే మిగిలిపోతున్నారు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్ ఓపెనర్ డామ్ సిబ్లీపై ఆ టీమ్ మేనేజ్‌మెంట్ వేటు వేసింది. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క సారి 35 రన్స్ చేశాడు. గత 10 టెస్ట్‌ల్లో అతని సగటు 19.77 మాత్రమే.

డేవిడ్ మలాన్‌కు చోటు..
దాంతో అతని ప్లేస్‌ను ఇంగ్లండ్ టీమ్‌మేనేజ్‌మెంట్ టీ20 స్పెషలిస్ట్ డేవిడ్ మలాన్‌తో భర్తీ చేసింది. మూడేళ్ల తర్వాత మలాన్‌కు మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడే అవకాశం దక్కింది. ఈ మార్పులపై చోప్రా స్పందించాడు.'సిబ్లీ, క్రాలీ ఇద్దరిపై వేటు వేశారు. వారి స్థానాల్లో డేవిడ్ మలాన్, సఖిబ్ మహమ్మూద్‌కు అవకాశం కల్పించారు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ల్లో సఖీబ్ దుమ్మురేపాడు. వాస్తవానికి సెకండ్ టెస్ట్ కోసమే అతన్ని పిలిపించినా తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే మార్క్ వుడ్ గాయపడిన నేపథ్యంలో అతనికి మూడో టెస్ట్‌లో అవకాశం దక్కవచ్చు. అంతేకాకుండా హెడింగ్లీలో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆప్షన్స్‌ను పెంచుకోవాలని భావించవచ్చు'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

టీ20 చాంపియన్..
ఈ సీజన్‌లో మలాన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అందులో 199 పరుగులతో రాణించాడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాము. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో తనదైన పెర్ఫామెన్స్‌తో వరల్డ్ నెంబర్ వన్ టీ20 ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 'మలాన్.. టీ20 చాంపియన్. డామ్ సిబ్లీ తడబడుతుండటంతో అతనికి టెస్ట్‌ల్లో మరో అవకాశం దక్కింది. హసీబ్ హమీద్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు డేవిడ్ మలాన్, ఓలి పోప్‌ను మిడిలార్డర్‌లో ఆడించవచ్చు. అప్పుడు బెయిర్ స్టోను ఫస్ట్ డౌన్‌లో పంపించవచ్చు.'అని చోప్రా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications