సొంతగడ్డపై భారత్‌ను ఓడించే సత్తా పాకిస్థాన్‌కే ఉందన్న అభిమాని.. అదరిపోయే కౌంటరిచ్చిన చోప్రా!

న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత్ జట్టును ఓడించడం అంత సులువైన పనికాదని క్రికెట్ ఆడే అగ్రదేశాలన్నిటీకి తెలుసు. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టే.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించేందుకు 19 ఏళ్లుగా శ్రమిస్తోంది. అప్పుడెప్పుడో 2004లో చివరి సారిగా గెలిచిన ఆస్ట్రేలియా.. ఈ సారి ఆ ముచ్చట తీర్చుకోవాలనే కసితో ఉంది. విదేశాల్లో మన ప్రదర్శన ఎలా ఉన్నా స్వదేశంలో భారత్‌ను ఓడించడం అనేది శక్తికి మించిన పని. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సైతం సొంతగడ్డపై భారత్‌ను ఓడించలేకపోతున్నాయి.
భారత్‌ను ఓడించే సత్తా..
అయితే ఈ అగ్రదేశాల వల్ల కానీ దాయాదీ దేశమైన పాకిస్థాన్ చేస్తుందని, భారత్‌ను ఓడించే సత్తా పాక్‌కే ఉందని ఓ అభిమాని ట్వీట్ చేయడం.. దానికి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా బదులివ్వడం చర్చనీయాంశమైంది.
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ట్విటర్ వేదికగా ఓ ఒపినీయన్ పోల్ పెట్టగా పాక్‌కు చెందిన సదరు అభిమాని 'భారత్‌లో టీమిండియా ఓడించే సత్తా పాకిస్థాన్‌కు మాత్రమే ఉంది'అని బదులిచ్చాడు. ఈ రిప్లేకు స్పందించిన ఆకాశ్ చోప్రా అదిరిపోయే కౌంటరిచ్చాడు.

బ్రదర్ సొంతగడ్డపై గెలవండి..
'నీ సానుకూల దృక్పథం చూస్తుంటే ముచ్చటేస్తుంది బ్రదర్.. కానీ నువ్వు అసలు విషయం మరిచిపోయినట్టున్నావ్. ముందు పాకిస్థాన్‌ను సొంతగడ్డపై సిరీస్ గెలవమను. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే పాక్ ఓటమిపాలైంది. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ చేతిలోనూ చిత్తయ్యింది. ఈ సిరీస్‌ల్లో మీరు గెలిచుంటే ఇప్పటికే పాకిస్థాన్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరేది.'అని వరుస ట్వీట్లు చేశాడు. దాంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

సూపర్ చోప్రా భాయ్..
చోప్రా ఇచ్చిన కౌంటర్‌కు భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. 'అవును చోప్రా భయ్యా.. కరెక్ట్ గా చెప్పారు.. విదేశీ జట్లు వాళ్ల దేశానికి వస్తే సిమెంట్ రోడ్లున్న పిచ్‌లను తయారుచేసి అబాసు పాలవుతున్న పాకిస్థాన్ మనకు నీతులు చెబుతోంది.'అంటూ కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఆకాశ్ చోప్రా ట్వీట్‌కు ఇంప్రెస్ అవడం గమనార్హం. సరిహద్దుల సమస్యలతో 2011 నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications