అతను లేడుగా టీమిండియాకు ఓటమి తప్పదు: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలవుతుందని మాజీ క్రికెటర్ ఆకాశో చోప్రా అభిప్రాయపడ్డాడు. భారత జట్టు కంటే బ్యాటింగ్, బౌలింగ్‌లో సౌతాఫ్రికా బలంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లేకుండా ఆడుతుందని, దాంతో రోహిత్ సేన మరింత బలహీనంగా తయారయ్యిందన్నాడు. ప్రపంచకప్ ముందు టీమిండియా ఆడనున్న ఏకైక సిరీస్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు మరోసారి చేతులెత్తేశారు.

ఆ ఇద్దరి రాకతో..
ఈ క్రమంలోనే బౌలింగ్ మెరుగు పర్చుకోవడంపై రోహిత్ సేన ఫోకస్ పెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం తొలి టీ20 జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకొని నెట్స్‌లో శ్రమించాయి. ఇక టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని వర్క్‌లోడ్ సమన్వయం చేయడంలో భాగంగా హార్దిక్ పాండ్యాకు.. పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు ఈ సిరీస్ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
ఈ సిరీస్ తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ఎయిడెన్ మార్కరమ్, క్వింటన్ డికాక్ చేరికతో సౌతాఫ్రికా జట్టు పటిష్టంగా కనిపిస్తోందని.. తొలి టీ20లో బవుమా బృందం విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు.

బలహీనంగా భారత్..
'చివరిసారి సౌతాఫ్రికా జట్టు భారత్‌కు వచ్చినపుడు ఎయిడెన్ మార్కరమ్ లేడు. క్వింటన్ డికాక్ కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అందుకే అప్పుడు సౌతాఫ్రికా కాస్త బలహీనంగా కనిపించింది. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో ఉన్నారు. బలమైన బ్యాటింగ్‌కు తోడు ప్రపంచ స్థాయి బౌలర్లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. టీమిండియా విషాయనికి వస్తే హార్దిక్ పాండ్యా లేకపోవడంతో జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుంది. ఈ సిరీస్‌కు పాండ్యా అందుబాటులో లేకపోవడం ఒక కారణం అయితే.. డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇక భువనేశ్వర్ కుమార్ ఇటీవలి కాలంలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.

డెత్ మరీ వీక్..
అయితే, ఈ సిరీస్‌కు అతను దూరంగా ఉన్నాడు. కానీ తర్వాత అతను ఎలా ఆడతాడన్నది చూడాలి. నాకైతే భువీ విషయంలో నమ్మకం కాస్త సడలింది. ఇక గాయం నుంచి కోలుకున్న ఆటగాడు సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. హర్షల్ పటేల్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆసీస్‌తో మూడో టీ20లో ఫైనల్ ఓవర్ అతను బౌలింగ్ చేసిన విధానం చూస్తే ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఏదేమైనా డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ అంశం కలవరపెడుతోందన్నది వాస్తవం'అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

ముచ్చటగా మూడోసారి..
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో టీమిండియాకు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్. జనవరిలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లగా.. జూన్‌లో ఆ జట్టు ఇక్కడికి వచ్చింది. తాజాగా మరోసారి సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. సఫారీ గడ్డపై ఓటమిపాలైన భారత్.. సొంతగడ్డపై దుమ్మురేపింది. మరోసారి అదే జోరును కనబర్చాలనే పట్టుదలతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications