For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra: ఇంగ్లండ్ టీమ్‌లో క్వాంటీటీ ఎక్కువ.. క్వాలిటీ తక్కువ!

 Aakash Chopra says This English team is more about quantity, not about quality

న్యూఢిల్లీ: ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులో క్వాంటిటీ ఎక్కువ క్వాలిటీ తక్కువగా ఉందని భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. తాజాగా జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్‌తో తలపడుతున్న ఇంగ్లండ్ టీమ్‌లో జోరూట్ ఒక్కడే నాణ్యమైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు. మిగతా ఆటగాళ్లంతా జట్టులో కేవలం సభ్యులు మాత్రమేనని విమర్శించాడు. ఇటీవల ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ 151 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో వర్షంతో గట్టెక్కిన ఆ జట్టు.. రెండో టెస్ట్‌లో పేలవ బ్యాటింగ్‌లో ఓటమిపాలైంది. దాంతో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లార్డ్స్ టెస్ట్ పరాజయంతో ఇంగ్లండ్ జట్టులో మార్పులు చేసింది.

 నో క్వాలిటీ..

నో క్వాలిటీ..

ఈ మార్పులపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇంగ్లండ్‌కు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆ జట్టు పరిస్థితి క్వాంటిటీ ఎక్కువ.. క్వాలిటీ తక్కువ అన్నట్లుగా ఉంది. ఒకే ఒక్క నాణ్యమైన ప్లేయర్ ఉన్నాడు. అతను బ్యాట్స్‌మెన్ జోరూట్. భారత భీకర బౌలింగ్ లైనప్ ముందు మిగతా ఆటగాళ్లంతా కేవలం జట్టులో అంకేలుగా మాత్రమే మిగిలిపోతున్నారు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్ ఓపెనర్ డామ్ సిబ్లీపై ఆ టీమ్ మేనేజ్‌మెంట్ వేటు వేసింది. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క సారి 35 రన్స్ చేశాడు. గత 10 టెస్ట్‌ల్లో అతని సగటు 19.77 మాత్రమే.

 డేవిడ్ మలాన్‌కు చోటు..

డేవిడ్ మలాన్‌కు చోటు..

దాంతో అతని ప్లేస్‌ను ఇంగ్లండ్ టీమ్‌మేనేజ్‌మెంట్ టీ20 స్పెషలిస్ట్ డేవిడ్ మలాన్‌తో భర్తీ చేసింది. మూడేళ్ల తర్వాత మలాన్‌కు మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడే అవకాశం దక్కింది. ఈ మార్పులపై చోప్రా స్పందించాడు.'సిబ్లీ, క్రాలీ ఇద్దరిపై వేటు వేశారు. వారి స్థానాల్లో డేవిడ్ మలాన్, సఖిబ్ మహమ్మూద్‌కు అవకాశం కల్పించారు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ల్లో సఖీబ్ దుమ్మురేపాడు. వాస్తవానికి సెకండ్ టెస్ట్ కోసమే అతన్ని పిలిపించినా తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే మార్క్ వుడ్ గాయపడిన నేపథ్యంలో అతనికి మూడో టెస్ట్‌లో అవకాశం దక్కవచ్చు. అంతేకాకుండా హెడింగ్లీ‌లో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆప్షన్స్‌ను పెంచుకోవాలని భావించవచ్చు'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

టీ20 చాంపియన్..

టీ20 చాంపియన్..

ఈ సీజన్‌లో మలాన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అందులో 199 పరుగులతో రాణించాడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాము. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో తనదైన పెర్ఫామెన్స్‌తో వరల్డ్ నెంబర్ వన్ టీ20 ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 'మలాన్.. టీ20 చాంపియన్. డామ్ సిబ్లీ తడబడుతుండటంతో అతనికి టెస్ట్‌ల్లో మరో అవకాశం దక్కింది. హసీబ్ హమీద్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు డేవిడ్ మలాన్, ఓలి పోప్‌ను మిడిలార్డర్‌లో ఆడించవచ్చు. అప్పుడు బెయిర్ స్టోను ఫస్ట్ డౌన్‌లో పంపించవచ్చు.'అని చోప్రా తెలిపాడు.

లీడ్స్‌లో మూడో టెస్ట్..

లీడ్స్‌లో మూడో టెస్ట్..

ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ జట్టులోకి రానున్నాడు. లీడ్స్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పు జరగనుంది. అంతేకాకుండా మరో స్పిన్నర్ జడేజా బౌలింగ్ తేలిపోవడంతో అశ్విన్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్‌ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలుతప్పకపోవచ్చు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Saturday, August 21, 2021, 20:06 [IST]
Other articles published on Aug 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+