Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aakash Chopra: ఈ గొడవలేందో గానీ.. భారత క్రికెట్ పరువు పోతుంది!

 Aakash Chopra says The loser is actually Indian Cricket over BCCI-Virat Kohli controversy

న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీ మార్పు అనంతరం భారత క్రికెట్‌లో నెలకొన్న పరిణామాలపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. ఈ అనవసర వివాదాల కారణంగా భారత క్రికెట్ ప్రతిష్ట దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్నటి వరకు రోహిత్ X విరాట్‌గా ఉన్న పరిస్థితి.. ఇప్పుడు కోహ్లీ X బీసీసీఐగా మారింది. టీ20 కెప్టెన్సీ వదులు కోవద్దని తాను కోహ్లీని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశానని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పగా.. అలాంటిదేమి జరగలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

టీ20 కెప్టెన్సీపై పునరాలోచన చేయాలని తనను ఎవరూ కోరలేదని సౌతాఫ్రికా పర్యటనకు ముందు బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో విరాట్ కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ మార్పుపై కూడా తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీతో సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు.

 పోయేది భారత క్రికెట్ పరువే..

పోయేది భారత క్రికెట్ పరువే..

ఈ వివాదంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. ఈ తరహా వివాదాలతో భారత క్రికెట్‌కు నష్టం కలుగుతుందన్నాడు. 'ఇక్కడ ఎవరు నిజం చెబుతున్నారు? మరెవరు అబద్దం చెబుతున్నారన్నది ప్రశ్నకాదు. అసలేందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయనేదే ప్రశ్న. ఎందుకుంటే ఈ తరహా వివాదాలతో నష్టపోయేది నువ్వో? నేనో.. ఇంకెవరో కాదు. భారత క్రికెట్‌కే తీరని నష్టం జరుగుతుంది.

 నిజం కన్నా ఊహ బలమైది...

నిజం కన్నా ఊహ బలమైది...

'నిజం కన్నా ఊహ' బలంగా ఉంటుందనే లైన్ చదివి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు జరుగుతుందంతా చూస్తే అది నిజమే అనిపిస్తోంది. సౌతాఫ్రికా పర్యటనలో తాను సెలవే కోరలేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. కానీ రోహిత్ శర్మ‌ను కెప్టెన్ చేయగానే విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగినట్లు అనిపిస్తోంది. అయితే ఈ పుకార్లు పుట్టిస్తుంది ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది అర్థం కావడం లేదు.

 కోహ్లీతో చర్చించాల్సింది..

కోహ్లీతో చర్చించాల్సింది..

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడే వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని విరాట్ కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు తెలిపాడు. అయితే కెప్టెన్సీ అనేది హక్కు కాదు అదొక గౌరవం. దాన్ని హక్కుగా భావిస్తే గౌరవం దక్కదు. అయితే దేశానికి ఎన్నో విజయాలందించిన వంటి విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే ముందు అతనితో చర్చించాల్సింది. కేవలం సమాచారం ఇచ్చి ఇలా చేయడం బాలేదు'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

 కపిల్, గవాస్కర్ సైతం..

కపిల్, గవాస్కర్ సైతం..

ఈ వివాదంపై భారత దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపీల్ దేవ్‌లు సైతం స్పందించారు. కోహ్లీ-గంగూలీ వివాదంలో.. భారత టెస్ట్ కెప్టెన్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీసీసీఐ మీదికంటే ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపైనే ఎక్కువగా ఉందని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇక కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఎంత పెద్ద క్రికెటర్ అయినా కెప్టెన్ విషయంలో నిర్ణయం తీసుకునేది సెలెక్టర్లేనని చెప్పాడు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించి సౌతాఫ్రికా పర్యటన మీద ఫోకస్ పెట్టాలని విరాట్ కోహ్లీకి చురకలంటించాడు.

Story first published: Thursday, December 16, 2021, 17:30 [IST]
Other articles published on Dec 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+