Ruturaj Gaikwad చిన్న పిల్లలతో ఆడినట్లే చితక్కొడుతున్నాడు! నో డౌట్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడటం ఖాయం!

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) స్టార్ ఓపెనర్, మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. రుతురాజ్ ఆటను చూస్తుంటే.. చిన్నపిల్లలతో ఆడుతున్నట్లే ఆడుతున్నాడని, ప్రతీ బౌలర్‌ను బెదరకుండా చితక్కొడుతున్నాడని కొనియాడాడు. సూపర్ ఫామ్‌లో ఉన్నటువంటి రుతురాజ్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికవ్వడం ఖాయమని చెప్పాడు.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లతో పోటీ ఉన్నా.. సెలెక్టర్లు రుతురాజ్‌ను పక్కనపెట్టలేరని చెప్పుకొచ్చాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలతో రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. రుతురాజ్ ఈ టోర్నీలో 603 పరుగులు చేసినా మహారాష్ట్ర నాకౌట్ స్టేజ్‌కు వెళ్లలేకపోయింది.

చిన్నపిల్లలతో..
ఇక విజయ్ హజారే ట్రోఫీలోని బెస్ట్ పెర్ఫామర్స్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అకాశ్ చోప్రా.. రుతురాజ్ ఆటను మెచ్చుకున్నాడు. 'విజయ్ హజారే ట్రోఫీలో ముందుగా మాట్లాడుకోవాల్సింది రుతురాజ్ రాజ్ గైక్వాడ్ గురించే. అతను నాలుగు సెంచరీలు బాదాడు. అందులో హ్యాట్రిక్ శతకాలు ఉన్నాయి.
అతను ఏ బౌలర్ కూడా ఔట్ చేయలేకపోయారు. అతను ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు చూశా. చిన్నపిల్లలతో ఆడినట్లే ఆడుతున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో కూడా స్వీప్ షాట్లు ఆడే ఏకైక బ్యాట్స్‌మన్ అతనే. సాధారణంగా స్పిన్ బౌలింగ్‌లో బౌండరీలు రాబట్టేందుకు బ్యాట్స్‌మన్ స్వీప్ షాట్స్ ఆడుతుంటారు.

తీవ్ర పోటీ ఉన్నా..
కానీ ఫాస్ట్ బౌలింగ్‌లో స్వీప్ షాట్స్ ఆడేవారు ఎవరున్నారు? బౌలర్లు సరైన బంతులే వేస్తున్నా రుతురాజ్ సూపర్ బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టాడు. ఈ లీగ్‌లోనే ఓ విభిన్నమైన బ్యాట్స్‌మన్‌గా కనిపించాడు. 113 స్ట్రైక్‌రేట్, 150 సగటుతో అతను 603 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలున్నాయి. ఈ టోర్నీలో 168, 21, 124, 154 నాటౌట్, 136 వరుసగా పరుగులు చేశాడు. టీమిండియాకు ఆడేందుకు అతను అన్నిరకాలుగా సిద్దంగా ఉన్నాడు. భారత జట్టులో ప్రస్తుతం టాపార్డర్‌లో ఖాళీ లేకున్నా.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లతో తీవ్ర పోటీ నెలకొన్నా సెలెక్టర్లు మాత్రం అతని పేరును ఖచ్చితంగా విస్మరించరు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ధావన్ ప్లేస్‌కు ఎసరు..
ఇక సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసే వన్డే జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తప్పించి అయినా ఈ యువ ఓపెనర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వయసు పైబడిన ధావన్‌కు బదులు రుతురాజ్‌ను ఎంచుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్.. ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. అదే ఫామ్‌ను విజయ్ హజారేలో కొనసాగించాడు. ఈ టోర్నీలో రుతురాజ్ 51 ఫోర్లతో పాటు 19 సిక్స్‌లు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications