For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కెప్టెన్సీలో మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే.. రెడీమేడ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ రెడీ'

Aakash Chopra says Rohit Sharma readymade choice for captaincy if India start looking for different direction

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్సీలో మార్పు చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భావిస్తే ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఓపెనర్ రోహిత్‌ శర్మ రెడిమేడ్‌గా ఉన్నాడని మాజీ టెస్టు క్రికెటర్, స్టార్ కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. రాబోయే 12 నెలల పాటు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడానికి భారత్‌కు ఎలాంటి సమస్యలు ఉండవని, అయితే రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కటి కూడా టీమిండియా గెలవలేకపోతే నాయకత్వ మార్పు గురించి ఆలోచించవచ్చని మాజీ భారత ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్‌ టైటిల్‌ నెగ్గడంలో విఫలమైతే నాయకత్వ మార్పులో కొత్త దిశగా వెళితే మాత్రం రోహిత్ ‌శర్మను ఆప్షన్‌గా చూడవచ్చన్నాడు.

రెడీమేడ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ రెడీగా ఉన్నాడు

రెడీమేడ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ రెడీగా ఉన్నాడు

స్పోర్ట్స్‌ వ్యాఖ్యాత సవేరా పాషాతో జరిగిన యూట్యూబ్‌ ఇంటరాక్షన్‌లో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ... 'ప్రస్తుతం టీమిండియా ఆటతీరు బాగుంది. రానున్న ఆరు నెలలు లేక ఏడాదిన్నర కాలంలో ఆట తీరులో ఏవైనా లోపాలు కనిపిస్తే.. కొత్త కెప్టెన్ కోసం చూసే అవకాశం ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీని తప్పుబట్టలేం. ఒక్కడిగా చూస్తే విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా ఎప్పుడో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. కానీ జట్టుగా చూస్తే మాత్రం విరాట్ కెప్టెన్‌గా ఇంకా నేర్చుకుంటున్నాడు. ఒకవేళ రానున్న కాలంలో నాయకత్వ మార్పును కోరుకుంటే రోహిత్‌ శర్మ రెడీమేడ్‌ కెప్టెన్‌గా రెడీగా ఉన్నాడు' అని అన్నాడు.

అప్పడు ఆలోచన చేయాల్సిందే

అప్పడు ఆలోచన చేయాల్సిందే

'వచ్చే 10 నుంచి 12 నెలల కాలం పాటు విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా ఉంటాడు. ఒకవేళ రానున్న ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్‌ టైటిల్‌ నెగ్గకపోతే మాత్రం నాయకత్వ మార్పు ఉంటుంది. రానున్న చాంపియన్స్‌ ట్రోపీని భారత్ గెలుస్తుందనే ఆశిస్తున్నా. ఎందుకంటే 2013 తర్వాత టీమిండియా చాంపియయన్స్‌ ట్రోపీ గెలవలేదు. అంతేగాక 2021లో టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో జరగనుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్కటి గెలవలేకపోయినా జట్టు మేనేజ్‌మెంట్‌ నాయకత్వ మార్పు గురించి ఆలోచన చేయాల్సిందే' అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.

కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తే

కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తే

ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు నాసర్‌ హుస్సెన్‌ మాత్రం విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడిని కెప్టెన్సీ పదవి నుంచి తీసే అవకాశం ఇప్పట్లో లేదన్నాడు. అతను ఆటగాడిగానే గాక కెప్టెన్‌గానూ విజయవంతం అయ్యాడని నాసర్‌ తెలిపాడు. ఇక విరాట్ కోహ్లీని కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తే అతను ఒత్తిడికి లోనవ్వకుండా తన ఆట తాను ఆడుకుంటాడని భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అతు్ల్‌‌ వాసన్‌ అన్నాడు. ఈ వ్యాఖ్యలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కొట్టిపారేశాడు.

ఐసీసీ టైటిళ్లు లేవు:

ఐసీసీ టైటిళ్లు లేవు:

2014లో మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ నుంచి టెస్టు క్రికెట్‌ బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ జట్టును అద్భుతంగా నడిపించాడు. అనతికాలంలోనే టెస్టుల్లో జట్టును నెంబర్‌వన్‌ స్థానంకు తీసుకెళ్లాడు. వరల్డ్‌ క్లాస్‌ పేసర్లతో టెస్టు క్రికెట్‌లో భారత్‌ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాడు. 2017లో పూర్తిగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ.. పరిమిత ఓవర్లలో కూడా జట్టును సమర్థంగానే నడిపించాడు. అయితే ఐసీసీ ఈవెంట్స్‌ టైటిళ్లను మాత్రం గెలవలేకపోయాడు. 2017లో జరిగిన చాంపియన్స్‌ ట్రోపీ ఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భంగపడింది.

కరోనా ఎఫెక్ట్: మరో కీలక సిరీస్ వాయిదా!!

Story first published: Tuesday, June 30, 2020, 15:59 [IST]
Other articles published on Jun 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+