Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'డీఆర్‌ఎస్‌కు ఎంఎస్ ధోనీ ఇప్పటికీ వీరాభిమాని కాదు'

Aakash Chopra says MS Dhoni is still not a huge fan of DRS, while Virat Kohli wants it in every game

ఢిల్లీ: డిసిషెన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్)‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ ఉపయోగించుకున్నంత బాగా మరే క్రికెటర్‌ ఉపగించుకోలేదు. ఇది వాస్తవం అన్న విషయం ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. డీఆర్‌ఎస్‌ను తీసుకున్న ప్రతిసారి మహీ 99 శాతం సక్సెస్ అయ్యాడు. దాంతో డెసిషన్‌ రివ్యూ సిస్టమ్ కాస్త ధోనీ రివ్యూ సిస్టమ్‌గా మార్చేశారు అభిమానులు. అయితే టీమిండియా మొదట్లో డీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిందని, అమలు చేయడానికి ఒప్పుకోలేదని మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

మొదటి జట్టు భారత్

మొదటి జట్టు భారత్

తాజాగా పాకిస్థాన్‌ బ్రాడ్‌కాస్టర్‌ సవేరా పాషాతో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ... 'డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకున్న మొదటి జట్టు భారత్. 2008లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌ సందర్భంగా అది జరిగింది. అప్పుడు ఎంఎస్ ధోనీ సారథి కాదు.. అనిల్‌ కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్‌లో భారత్‌ కొన్ని తప్పుడు సమీక్షలు తీసుకుంది. అప్పట్లో అది కొత్త సాంకేతిక పద్ధతి కావడంతో భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు తప్పుడు ఫలితాలు వచ్చాయి. అప్పుడే టీంఇండియాకు నచ్చలేదని నిర్ణయం తీసుకుంది' అని అన్నాడు.

ధోనీకి కూడా నచ్చలేదు

ధోనీకి కూడా నచ్చలేదు

'డీఆర్‌ఎస్‌ పద్ధతిని భారత్ వ్యతిరేకించింది. మరోవైపు ఆ సాంకేతిక ఎంఎస్ ధోనీకి కూడా నచ్చలేదు. అయితే కెప్టెన్‌ అభిప్రాయానికే విలువ ఉంటుంది. అది సాంకేతిక పరమైన విషయమైనా పూర్తిస్థాయిలో సరైన ఫలితం ఇవ్వదని చాలాకాలం తర్వాత ధోనీ నమ్మాడు. మరోవైపు ఇప్పటికీ అంపైరింగ్‌ నిర్ణయాల్లో వివాదాలున్నాయి. డీఆర్‌ఎస్‌పైనా అనుమానాలున్నాయి. కానీ ఇప్పటి కన్నా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి' అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

 డీఆర్‌ఎస్‌కు కోహ్లీ వీరాభిమాని:

డీఆర్‌ఎస్‌కు కోహ్లీ వీరాభిమాని:

ఎంఎస్ ధోనీకి డీఆర్‌ఎస్ సాంకేతికత నచ్చకపోవడంతో టీమిండియా కూడా దాన్ని వ్యతిరేకించేది అని టీమిండియా మాజీ క్రికెటర్ చెప్పాడు. ఇక ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డీఆర్‌ఎస్‌కు వీరాభిమాని అని, ప్రతీ మ్యాచ్‌లో దాన్ని అమలు చేయాలని కోరుకుంటాడని ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు. ఐపీఎల్‌ అయినా, రంజీ అయినా కోహ్లీ డీఆర్‌ఎస్ పద్ధతికి ఒప్పుకుంటాడన్నాడు. సాంకేతిక అంశాల పరంగా ఇప్పుడు అందరి ఆలోచనలు మారాయని, దాన్ని అలాగే కొనసాగిస్తూ మరింత మంచి ఫలితాలు సాధించాలని ఆకాశ్ ‌చోప్రా అకాంక్షించాడు.

ధోనీకి డీఆర్‌ఎస్ నచ్చకపోయినా:

ధోనీకి డీఆర్‌ఎస్ నచ్చకపోయినా:

ఎంఎస్ ధోనీకి డీఆర్‌ఎస్ సాంకేతిక నచ్చకపోయినా, తాను మాత్రం దాన్ని 'ధోనీ రివ్యూ సిస్టమ్'‌గా పిలుస్తానని ఆకాశ్ ‌చోప్రా పేర్కొన్నాడు. ఎందుకంటే.. అతడు తీసుకునే సమీక్షల్లో 10లో 9 సార్లు సరైన ఫలితాలొస్తాయని ఆయన గుర్తుచేశాడు. ఒకవేళ ధోనీ అంచనా తప్పని మనకు అనిపించినా.. ఫలితం మాత్రం అతడికి అనుకూలంగానే వస్తుందని ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

'కెప్టెన్సీలో మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే.. రెడీమేడ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ రెడీ'

Story first published: Tuesday, June 30, 2020, 18:24 [IST]
Other articles published on Jun 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+