న్యూఢిల్లీ: టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే తుది జట్టులో హైదారబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను ఆడించాలని టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్ తుది జట్టులో సిరాజ్ తప్పకుండా తీసుకోవాలని తెలిపాడు. వన్డేల్లో అతనికి అద్భుతమైన గణాంకాలు ఉన్నాయని చెప్పిన ఆకాశ్ చోప్రా... మెగా టోర్నీలో అతను కీలకమవుతాడని వ్యాఖ్యానించాడు.
జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ కంటే సిరాజ్ గణంకాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పాడు. మూడో పేసర్‌గా శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణలను ఆడించడం కంటే సిరాజ్‌ను ఆడించడం ఉత్తమమని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.'మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విధానం అద్భుతం. అతి తక్కువ కెరీర్‌లోనే 24 మ్యాచుల్లో 43 వికెట్లు తీశాడు.

ఎకానమీ కూడా 4.78. బుమ్రా, షమీ కంటే కూడా గణంకాల్లో అతను ఎంతో మెరుగైన బౌలర్. అందుకే ఆసియా కంటే ఇతర దేశాల మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను లేదా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను ఆడించాలని చాలామంది చెబుతుంటారు. కానీ, వారిద్దరి కంటే సిరాజ్ తుది జట్టులో ఆడించాల్సిందే.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
మన్డేల్లో జస్‌ప్రీత్ బుమ్రా గణంకాలు కూడా మెరుగ్గానే ఉన్నాయని ఆకాశ్ చోప్రా కొనియాడాడు. 'జస్‌ప్రీత్ బుమ్రా 72 మ్యాచ్‌ల్లో 121 వికెట్లు తీసాడు. 24.3 సగటు.. 4.63 ఎకానమీని నమోదు చేశాడు. ప్రతీ మ్యాచ్‌లో కనీసం రెండు వికెట్లు తీసాడు. ఆసియాలో కూడా అతనికి మంచి రికార్డు ఉంది. 23.9 యావరేజ్, 4.65 ఎకానమీ రేటుతో వికెట్లు పడగొట్టాడు.
ఆసియాకప్ 2023 కోసం టీమిండియా ఆటగాళ్లు సన్నదమవుతున్నారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్యాంప్‌లో ఫిట్‌నెస్ డ్రిల్స్‌తో పాటు ప్లేయర్లకు యోయో ఫిట్‌నెస్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 30న ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.