
రాహుల్‌కి వరుసగా అవకాశాలు
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టుకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. పంత్ ఫెయిల్ అవ్వగా.. రాహుల్ సక్సెస్ అయ్యాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాత్కాలిక వికెట్ కీపర్‌గా రాహుల్ కొనసాగుతున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో సైతం కీపర్‌గా రాహుల్‌ను కొనసాగించాలా? వద్దా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కొందరు తమ అభిప్రాయాలు చెప్పగా.. ఈ జాబితాలో ఆకాశ్ చోప్రా కూడా చేరిపోయాడు.

మోరే క్యాచ్ వదిలేస్తే.. గూచ్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు
టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపింగ్ చాలా ప్రత్యేకమైందని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్ ఉదాహరణ చెప్పాడు. గతంలో భారత కీపర్‌గా చేసిన కిరణ్ మోరే ఉదంతాన్ని చోప్రా గుర్తు చేశాడు. 'టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపింగ్ చాలా ప్రత్యేకమైంది. 1990లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కిరణ్ మోరే రెగ్యులర్ కీపర్‌గా ఉన్నాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో గ్రాహం గూచ్ క్యాచ్‌ను మోరే వదిలేస్తే.. అతను ట్రిపుల్ సెంచరీ (333) చేశాడు. వికెట్ల వెనకాల ఏ ఒక్క చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. రాహుల్‌ను కీపర్ కొనసాగించవద్దు' అని విజ్ఞప్తి చోప్రా చేశాడు.

తాత్కాలిక కీపింగ్ సెట్ కాదు
'కీపింగ్ అనేది ప్రత్యేకమైన జాబ్. దానికి తాత్కాలిక కీపింగ్ సెట్ కాదు. ఇక లోకేష్ రాహుల్ పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవడాన్ని వదులుకోవాలి. అటు ఓపెనర్‌గానో, ఇటు మిడిల్ ఆర్డర్‌లోనో కొనసాగాలి కానీ బహుముఖ పాత్రలు పోషిస్తే అది కెరీర్‌కే ప్రమాదం తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ శిఖర్ ధావన్-రోహిత్ శర్మలే భారత రెగ్యులర్ ఓపెనర్లు అని నేను భావిస్తున్నా. రాహుల్‌ను టెస్టుల్లో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా తీసుకోవడం కష్టమే' అని ఆకాష్ చోప్రా అన్నాడు.

సాహా ఏమైనా తప్పు చేశాడా?
'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్ రాహుల్ కీపర్‌గా ఆకట్టుకోవడంతో స్పెషలిస్టు కీపరైన రిషభ్ పంత్‌ను పక్కకు కూర్చోబెట్టడం మంచి నిర్ణయం కాదు. పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇచ్చి చూడాలి. అప్పటి వరకూ కీపర్‌గా రాహుల్ వెయిట్ చేయకతప్పదు. రాహుల్‌ను వెయిట్ చేయించాలి కానీ.. స్పెషలిస్టు కీపరైన పంత్‌ను కాదు. వృద్ధిమాన్ సాహాకు కూడా అవకాశాలు ఇవ్వకపోవడం ఏంటో నాకు అర్ధం కావట్లేదు. అతను కీపర్‌గా ఏమైనా తప్పు చేశాడా?' అని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు. ఆకాశ్ చోప్రా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక ఏడాది మాత్రమే భారత్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన చోప్రా.. 10 టెస్టులాడి 23 సగటుతో 437 పరుగులు చేశాడు.
దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్.. జొకోవిచ్‌లో రెట్టింపైన భయం!!


Click it and Unblock the Notifications












