Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్‌.. జొకోవిచ్‌లో రెట్టింపైన భయం!!

Grigor Dimitrov tests positive for coronavirus after playing in Novak Djokovic event

క్రోయేషియా: సాధారణ ప్రజానీకం నుంచి సెలెబ్రిటీల దాకా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే స్టార్ క్రికెటర్లు షాహిద్‌ అఫ్రీది, మష్రాఫె మోర్తజాకు కరోనా సోకగా.. టెన్నిస్ ఆటగాడు గ్రిగర్‌ దిమిత్రోవ్‌కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. క్రోయేషియాలో జరిగిన ఆడ్రియా టూర్ ‌ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో ఆడిన దిమిత్రోవ్‌కు జ్వరం రావడంతో.. టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాను యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇటీవల స్పష్టం చేసిన సెర్బియా స్టార్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు భయం రెట్టింపు అయ్యింది. ఎందుకంటే.. ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్‌ టోర్నమెంట్‌లో భాగంగా జొకోవిచ్‌-దిమిత్రోవ్‌లు కలిసి డబుల్స్‌ ఆడారు. టోర్నమెంట్‌లో భాగంగా శనివారం బోర్నా కారిక్‌తో (సెకండ్‌ లెగ్) మ్యాచ్‌ ఆడిన దిమిత్రోవ్‌కు జ్వరం రావడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దిమిత్రోవ్‌కు కరోనా అని తేలడంతో ఆ ఫైనల్‌ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌-ఆండ్రీ రూబ్లెవ్‌లు తలపడాల్సి ఉండే.

తనకు ప్రమాదకర కరోనా వైరస్ సోకిన విషయాన్ని సన్నిహితులకు, ఫ్యాన్స్‌కు తెలియజేయాల్సిన అవసరం ఉందన్న గ్రిగర్‌ దిమిత్రోవ్..‌ ఇన్‌స్టా వేదికగా ఆ విషయాన్ని వెల్లడించాడు. గత కొన్ని రోజుల నుంచి తనతో ఎవరైతే కాంటాక్ట్‌ అయ్యారో వారి పేర్లు కూడా అతగాడు వెల్లడించాడు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తనతో ఆడిన వారంతా టెస్టులు చేయించుకోవాలని దిమిత్రోవ్‌ సూచించాడు. 'నేను ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాను. నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించండి. ప్రస్తుతం నేను ఇంట్లోనే కోలుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ థాంక్స్‌' అని పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బంగ్లా పార్లమెంట్‌ సభ్యుడైన మష్రాఫె మోర్తజాకు రెండు రోజుల క్రితమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మోర్తజా స్వయంగా స్పష్టం చేశాడు. దీంతో పాక్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రీది తర్వాత కరోనా బారిన పడ్డ రెండో అతిపెద్ద క్రికెట్‌ సెలెబ్రిటీగా మోర్తజా నిలిచాడు. ప్రస్తుతం ఢాకాలోని నివాసంలో సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉన్నాడు 36 ఏళ్ల మోర్తజా. బంగ్లాకే చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నజ్ముల్‌ ఇస్లామ్‌, మాజీ క్రికెటర్‌ నఫీజ్‌ ఇక్బాల్‌కు కూడా కరోనా సోకినట్టు అక్కడి మీడియా తెలిపింది. వీరిద్దరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని సమాచారం.

Story first published: Monday, June 22, 2020, 15:37 [IST]
Other articles published on Jun 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+