విలియమ్సన్ మోచేతి గాయం నయం కాలేదనకుంటా.. దమ్ముంటే అభిషేక్ శర్మ గుజరాత్‌పై ఆడాలి: ఆకాశ్ చోప్రా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వైఫల్యానికి అతని గాయమే కారణం కావచ్చని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సందేహం వ్యక్తం చేశాడు. మోచేతి గాయం కారణంగా కొంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న కేన్.. ఐపీఎల్ 2022 సీజన్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు.
అయితే సన్‌రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 2, 16, 32 పరుగులతో విఫలమయ్యాడు. చెన్నైతో గత మ్యాచ్‌లో 32 పరుగులు చేసినా.. 40 బంతులు ఆడాడు. అతని టెస్ట్ తరహా బ్యాటింగ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

గాయంతో కేన్..
ఇక గుజరాత్ టైటాన్స్ నేపథ్యంలో సన్‌రైజర్స్ టీమ్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుందన్నాడు. 'కేన్ విలియమ్సన్ ఇంకా ఫామ్ అందుకోలేదు. అతను తన ఎల్బో గాయంతో బాధపడుతున్నాడేమోననేది నా సందేహం.
బ్యాటింగ్‌లో అతను ఇంకా రిథమ్ అందుకోలేదు. సన్‌రైజర్స్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్‌లతో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సుందర్‌ను అప్ ది ఆర్డర్‌లో ఆడించాలి. మిగతా బ్యాటర్లు లాకీ ఫెర్గూసన్ పేస్‌ను, రషీద్ ఖాన్ స్పిన్‌ను ఆడలేరు.

అభిషేక్ శర్మ.. నాకు డౌటే..
ఏ జట్టు ఓపెనర్లు అయినా గుజరాత్‌తో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. చెన్నైతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్‌తో ఏ జట్టు ఓపెనర్లు అయినా రాణిస్తున్నారు. ఆ క్రమంలోనే అభిషేక్ కూడా రాణించాడు. అయితే గుజరాత్‌తో ఎలా ఆడుతాడో చూడాలి. నా అంచనా ప్రకారం టాప్ క్లాస్ బౌలింగ్ ఉన్న గుజరాత్‌తో అతను విఫలమవుతాడు. ఈ బౌలింగ్ అటాక్‌కు ఏ జట్టు ఓపెనర్లు అయినా విఫలమవుతున్నారు.

ఆ ఇద్దరిని ఔట్ చేస్తేనే విజయం..
భువనేశ్వర్ కుమార్ పర్వాలేదనిపిస్తున్నా.. గొప్పగా అయితే బౌలింగ్ చేయడం లేదు. అతను చాలా నెమ్మదిగా బంతులు వేస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ వేగంగా వేస్తున్నా ధారళంగా పరుగులిస్తున్నాడు. నటరాజన్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. మార్కో జాన్సెన్, రొమారియో షెఫెర్డ్‌లకు పెద్దగా వ్యత్యాసం ఏం లేదు. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలను ఆరంభంలోనే ఔట్ చేస్తే సన్‌రైజర్స్‌కు విజయవకాశాలు ఉంటాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications