Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aakash Chopra: నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ? శ్రేయస్ అయ్యర్?.. చెప్పడం కష్టం!

Aakash Chopra Says ‘It’s A Tough Call’ Between Shreyas Iyer And Suryakumar Yadav For No. 4 Spot In T20Is
Suryakumar Yadav VS Shreyas Iyer - Tough Call For No. 4 Spot

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయాలా? లేదా శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోవాలా? అనే ప్రశ్నకు ప్రస్తుతం జవాబు చెప్పడం చాలా కష్టమని మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. తానే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో సెలెక్టర్లు కూడా ఈ విషయాన్ని చెప్పలేరన్నాడు.

ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్ చోటు దక్కించుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాంతో అతన్ని లంక పర్యటనకు ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా యూట్యూబ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చోప్రా ఇలా సమాధానమిచ్చాడు.

ఇప్పుడు చెప్పలేం..

ఇప్పుడు చెప్పలేం..

శ్రేయస్‌, సూర్యకుమార్‌ల ఎంపిక విషయంలో తాను కానీ, టీమిండియా సెలెక్టర్లు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పాడు. 'ఇది చాలా కష్టతరమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. అలాగే సెలెక్టర్లు కూడా చెప్పలేరు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తే కోహ్లీ మూడో స్థానంలో ఆడతాడు. తర్వాత హార్దిక్‌, రిషభ్‌ పంత్‌.. ఐదు, ఆరు స్థానాల్లో ఉంటారు. ఆపై రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ వరుసగా ఉన్నారు. అలాంటప్పుడు అక్కడ మిగిలింది నాలుగో స్థానమే. దాంతో శ్రేయస్‌ను తీసుకోవాలా లేక సూర్యకుమార్‌ను ఎంపిక చేయాలా అనేది కఠిన నిర్ణయంగా మారుతుంది' అని చోప్రా పేర్కొన్నాడు.

ఫామ్‌ను బట్టే ఫైనల్ డిసిషన్..

ఫామ్‌ను బట్టే ఫైనల్ డిసిషన్..

'అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపికచేయడానికి ప్రధాన కారణాలు.. అతనికి మంచి అనుభవం ఉండటం. వన్డే జట్టులో ఇదివరకే బాగా ఆడటం. మరోవైపు ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి. మరోవైపు సెప్టెంబర్‌లో జరిగే ఐపీఎల్‌లో మరోసారి బాగా ఆడితే అతడిని ఎంపిక చేయొచ్చు. మరోవైపు సూర్యకుమార్‌ కూడా ఈ లంక పర్యటనలో దంచికొట్టి, ఆపై ఐపీఎల్‌లో మెరిస్తే అతన్ని కూడా ప్రపంచకప్‌ ఈవెంట్‌కు ఎంపిక చేయవచ్చు. ఇది ఎటూ అర్థంకాని పరిస్థితి. ఇద్దరూ బాగా ఆడతారు. టీ20ల అనుభవం కూడా బాగుంది. అలాంటప్పుడు ప్రస్తుత ఫామ్‌ను చూసే వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఆ ఇద్దరు ఆడతారని చెప్పలేను..

ఆ ఇద్దరు ఆడతారని చెప్పలేను..

ఇక టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా ఆడతారని చెప్పలేనని ఆకాశ్ చోప్రా సమాధానమిచ్చాడు. 'ఈ ఇద్దరు సుదీర్ఘ ఫార్మాట్‌లోకి కమ్ బ్యాక్ చేస్తారా? లేదా? అని చెప్పలేను.

ఈ పరిస్థితుల్లో టెస్ట్ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేడనే విషయం తెలుసు. అతను బౌలింగ్ చేసేవరకు టెస్ట్ క్రికెట్‌లోకి రాలేడు. బ్యాట్స్‌మన్‌గా సెంచరీ చేసినా.. బౌలింగ్ చేస్తేనే అతనికి జట్టులో చోటు దక్కుతుంది. లేదంటే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అయిన హనుమ విహారీని తీసుకోవచ్చు. ఫిట్‌నెస్ సమస్యలు లేకుంటే భువీ టెస్ట్ జట్టులోకి వస్తాడు. కానీ అతను టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ వాటిని అతను ఖండించాడు. టెస్ట్ క్రికెట్ ఆడుతానని చెప్పాడు. ఫిట్‌గా ఉంటే జట్టులోకి రావడం ఖాయం'అని చోప్రా పేర్కొన్నాడు.

Story first published: Sunday, July 11, 2021, 17:44 [IST]
Other articles published on Jul 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+