Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: డేంజర్ జోన్‌లో టీమిండియా.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడిస్తేనే రోహిత్ సేనకు ఫైనల్‌ బెర్త్!

Aakash Chopra says If India beat Australia 4-0, they will rise in the WTC standings

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా డేంజర్ జోన్‌లో నిలిచింది. ఇటీవల ఇంగ్లండ్‌పై విజయం సాధించిన సౌతాఫ్రికా పాయింట్స్ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. భారత్ నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ 2022-23 సైకిల్‌లో భారత్ ఇంకా 6 టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌ గడ్డపై రెండు టెస్ట్‌ల సిరీస్.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సింది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చే ఏడాది జరగనుంది.

డేంజర్ జోన్‌లో రోహిత్ సేన..

డేంజర్ జోన్‌లో రోహిత్ సేన..

ప్రస్తుతం 52.08 విజయాల శాతంతో భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా(75 శాతం), ఆస్ట్రేలియా(70 శాతం), శ్రీలంక(53.33 శాతం) భారత్ కన్నా ముందున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో భారత్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌ను 4-0తో క్లీన్ స్వీప్ చేస్తే రోహిత్ సేనకు అవకాశం ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురించి మాట్లాడిన చోప్రా భారత అవకాశాలను వెల్లడించాడు.

4-0తో గెలవాలి..

4-0తో గెలవాలి..

'ఆస్ట్రేలియా.. భారత్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను భారత్ 4-0తో గెలవాలి. అప్పుడే పాయింట్స్ టేబుల్‌లో మెరుగవుతారు. లేకుంటే ప్రమాదంలో పడతారు. ఇక ఆస్ట్రేలియా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ విజయం సాధిస్తుంది. సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

6 మ్యాచ్‌లు గెలిచినా..

6 మ్యాచ్‌లు గెలిచినా..

ఈ క్రమంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇచ్చే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 4-0తో క్లీన్ స్వీప్ చేయాలి. బంగ్లాదేశ్ గడ్డపై కూడా భారత్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలవడం కష్టమే. కానీ ఇది తప్పా భారత్‌కు మరో ఆప్షన్ లేదు. ఇవన్నీ గెలిచినా భారత్ 68 శాతం విజయాలనే నమోదు చేస్తుంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

చేజారిన సువర్ణవకాశాం

చేజారిన సువర్ణవకాశాం

6 మ్యాచ్‌లకు 6 గెలిచినా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు ఫైనల్ చేరేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం భారత అవకాశాలను దెబ్బతీ సింది. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్.. తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. న్యూజిలాండ్ జరిగిన ఫైనల్లో పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలై విశ్వవిజేతగా నిలిచే సువర్ణవకాశాన్ని కోహ్లీ సారథ్యంలోని భారత్ కోల్పోయింది.

Story first published: Tuesday, August 23, 2022, 18:38 [IST]
Other articles published on Aug 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+