Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రతీ ఒక్కడు ధోనీ కాలేడు: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో యువ ప్లేయర్ తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా హార్దిక్‌ పాండ్య సిక్స్‌ కొట్టడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలుస్తూ ట్రోలింగ్‌‌కు దిగారు. ఒక మ్యాచ్‌లో ధోనీకి విన్నింగ్‌ షాట్‌ కొట్టే అవకాశం వచ్చినా విరాట్ కోహ్లీకి ఛాన్స్‌ ఇచ్చి మరీ అందరితో ప్రశంసలు అందుకొన్నాడు. కానీ, హార్దిక్‌ పాండ్యా మాత్రం చాలా బంతులు మిగిలి ఉన్నప్పటికీ సింగిల్‌ ఇద్దామనే ఆలోచన చేయకపోవడం వివాదాస్పదమైంది.

Aakash Chopra

యువ ప్లేయర్ హాఫ్ సెంచరీకి అవకాశం ఇచ్చి ఉంటే అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ విమర్శలను ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. ప్రతీ ఒక్కరు ధోనీ కావాల్సిన అవసరం లేదన్నాడు. అసలు టీ20ల్లో మైలురాళ్లు గురించి ఆలోచించడం అనవసరమని అభిప్రాయపడ్డాడు.

'మహేంద్ర సింగ్ ధోనీని మార్గదర్శకంగా భావించే హార్దిక్‌ పాండ్యా.. అతనిలా కానక్కర్లేదు. ధోనీ ఆరాధ్య దైవంగా భావించినా అతనిలా ఉండాల్సిన అవసరం హార్దిక్ పాండ్యాకు ఏ మాత్రం లేదు. అసలు టీ20ల్లో మైలురాళ్లు గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచన ఉంటుంది.

గతంలో ధోనీ డిఫెన్స్‌ ఆడి మరీ విన్నింగ్‌ షాట్‌ను కొట్టే అవకాశం విరాట్‌కు ఇచ్చిన సంఘటన నాకు గుర్తుంది. అలా అని హార్దిక్ పాండ్యాను కూడా అలా చేయమనడం సరికాదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో రెండు ఓడి ఒక మ్యాచ్ గెలిచిన హార్దిక్ సేన మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఫ్లోరిడా వేదికగా ప్రారంభమయ్యే నాలుగో టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Saturday, August 12, 2023, 17:16 [IST]
Other articles published on Aug 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+