
ఆ నలుగురు ఎవరు?
టీమ్ ఎంపిక విషయంలో ప్రతీసారి విమర్శలు ఎదుర్కొనే ఆర్‌సీబీ ఈ సారి మాత్రం సమతూకమైన జట్టును ఎంచుకుంది. అంతకుముందు ఎక్కువ బ్యాటింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చి బలహీనమైన బౌలింగ్‌తో ఇబ్బంది పడేది. కానీ ఈసారి కైల్ జెమీసన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంది. దాంతో ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో కోహ్లీసేన అదరగొట్టింది. ఐపీఎల్ 2022 మెగా వేలం ముందు జట్లన్నీ నలుగురినే మాత్రమే రిటైన్ చేసుకోవాలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోహ్లీసేన ఎవరిని ఎంచుకుంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను తీసుకోవడం ఖాయమని తెలుస్తున్నా.. మిగతా ఇద్దరు ఎవరనేది చెప్పలేకపోతున్నారు. అయితే ఆకాశ్ చోప్రా ఆర్‌సీబీ తీసుకునే నలుగురు ప్లేయర్లను అంచనా వేసాడు.

పడిక్కల్, చాహల్..
'ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఎవర్ని రిటైన్ చేసుకుంటుందా? అంటే నేను చెప్పలేను. కానీ ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనేది మాత్రం చెప్పగలను. ఆర్‌సీబీ జట్టును పరిశీలిస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట, ఏబీ డివిలియర్స్‌ను రెండో ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మూడు, నాలుగో ప్లేయర్‌గా యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్‌ను రిటైన్ చేసుకుంటుందనుకుంటున్నా. ముగ్గురు ఇండియన్స్, ఓ ఓవర్‌సీస్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలనేది నా అభిప్రాయం. ఆ క్రమంలోనే యుజీ, పడిక్కల్, కోహ్లీలను భారత ఆటగాళ్లుగా.. ఓవర్‌సీస్ కోటాలో ఏబీడీని ఆర్‌సీబీ అంటిపెట్టుకుంటుందని చెబుతున్నా.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

రైట్ టు మ్యాచ్..
రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఉంటే మాత్రం గ్లేన్ మ్యాక్స్‌వెల్, కైల్ జెమీసన్‌లను తీసుకోవాలని, అప్పుడు వారి రూ.15, రూ.14 కోట్ల కాంట్రాక్టు కూడా తగ్గే అవకాశం ఉంటుందని చోప్రాచెప్పుకొచ్చాడు. కానీ బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ఐపీఎల్ 2022 మెగా వేలం ముందు ప్రతీ జట్టు నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాలని అందులో ఇద్దరు స్వదేశీ, మరో ఇద్దరు విదేశీ, లేదా ముగ్గురు స్వదేశీ, ఒకరు విదేశీ ఆటగాడిని తీసుకోవాలి. ఎలాంటి రైట్ టూ ఆప్షన్ ఉండదని తెలుస్తోంది. డిసెంబర్‌లో మెగా వేలం జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications
