Aakash Chopra:ఆర్‌సీబీకే కాదు ఏ జట్టుకు డేవిడ్ వార్నర్ సారథిగా ఉండడు!

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ కేవలం ఓపెనర్‌గానే కొనసాగుతాడని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అతన్ని కెప్టెన్‌గా నియమించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా సుముఖంగా లేదన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా అతన్ని ఓపెనర్‌గానే పరిగణలోకి తీసుకుంటాయని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అయితే అతని వంక కూడా చూడటం లేదన్నాడు. అయితే లీగ్‌లో ఉన్న అతని బ్యాటింగ్ రికార్డ్స్ దృష్ట్యా భారీ ధర పలికే అవకాశం ఉందన్నాడు.

భారీ ధరనే కానీ..
ఐపీఎల్ 2022 మెగా వేలంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతున్న ఆకాశ్ చోప్రా వార్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'డేవిడ్ వార్నర్ భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీబడుతాయి. అయితే నాకున్న సమాచారం మేరకు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని తీసుకుంటుందని, కేఎల్ రాహుల్‌తో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడని అనుకున్నా. కానీ అలా జరగలేదు. హైదరాబాద్ అతన్ని వదిలేసింది. చెన్నై ఎలాగూ అతన్ని తీసుకునేందుకు సుముఖంగా లేదు. ముంబై ఇండియన్స్ అతన్ని పరిగణలోకి తీసుకుంటుందని అస్సలు అనుకోలేను.

కేవలం ఓపెనర్‌గానే..
అతను భారీ ధర పలకడని చెప్పడం లేదు కానీ. ఇతర ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడుతాయి. లీగ్‌లో అతను సాధించిన పరుగులే అతనికి డిమాండ్ తెచ్చిపెట్టాయి. అతనో అద్భుతమైన ఆటగాడు. అయితే వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకోవాలని ఏ ఫ్రాంచైజీ అనుకోవడం లేదు. ఓపెనర్‌గా మాత్రమే అతన్ని జట్టులోకి తీసుకోవాలనుకుంటున్నాయి. అతను కచ్చితంగా రూ.15 నుంచి రూ.17 కోట్లు పలికే చాన్సుంది.

కెప్టెన్సీ అయితే రాదు..
లీగ్‌లో పంజాబ్, ఆర్‌సీబీ, కేకేఆర్ మూడు జట్లకే కెప్టెన్ అవసరం ఉంది. పంజాబ్ మయాంక్ అగర్వాల్‌కు ఇవ్వాలనుకున్నా.. మిగతా రెండు జట్లకు అయితే కెప్టెన్సీ అవసరం ఉంది. అయితే డేవిడ్ వార్నర్‌ను మాత్రం కెప్టెన్‌గా ఏ టీమ్ తీసుకోదు. కేవలం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గానే పరిగణలోకి తీసుకుంటాయి.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే డేవిడ్ వార్నర్ ఆర్‌సీబీలోకి వెళ్లడం ఖాయమని, ఆ జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపడుతాడనే ప్రచారం జోరుగా సాగుతుంది.

50 హాఫ్ సెంచరీలు..
2009లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వార్నర్.. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 163 పరుగులు చేశాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన వార్నర్.. సీజన్ ముగింపులో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆ సీజన్‌లో 528 పరుగులు చేసిన వార్నర్.. 2015లో 562 రన్స్ చేశాడు. ఇక 2016లో 848 రన్స్ చేసి.. టైటిల్ గెలిపించాడు. ఓవరాల్‌గా 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 5449 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications